మొహం మీద ఉండే పుట్టుమచ్చ ( Mole ) కొందరికి బ్యూటీ స్పాట్ గా చాలా అందంగా కనిపిస్తూ ఉంటుంది.ముఖంలో కొన్ని భాగాలలో కనిపించే పుట్టుమచ్చలు ప్రత్యేక అందాన్ని ఇస్తాయి.
అయితే పుట్టుమచ్చలను బట్టి వ్యక్తుల వ్యక్తిత్వాలు వారి జాతకాలు కూడా తెలుసుకోవచ్చు అని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.మన జాతకాన్ని అనుసరించే మన శరీరం మీద పుట్టుమచ్చలు ఏర్పడతాయని జ్యోతిష్యంలో ఉంది.
పుట్టుమచ్చలు అదృష్ట, దురదృష్టాలకు సంకేతాలు.
కొన్ని పుట్టుమచ్చలు స్త్రీ పురుషులకు ఒకేలాంటి ఫలితాలను ఇస్తాయి.
మరికొన్ని వేరువేరు ఫలితాలను ఇస్తాయి.ముఖం( Face ) మీద కుడి వైపున మచ్చలు ఉన్న పురుషులు అదృష్టవంతులవుతారు.
నల్లటి పుట్టుమచ్చ కంటే గోధుమ రంగు లేదా ఆకుపచ్చ రంగు లో ఉండే పుట్టుమచ్చలు శుభసంకేతాలుగా శాస్త్రంలో ఉంది.శరీరంలో కొన్ని భాగాల్లో కనిపించే పుట్టుమచ్చలు తన ధనయోగాన్ని సూచిస్తాయి.
ముఖ్యంగా చెప్పాలంటే కనుబొమ్మల దగ్గర పుట్టుమచ్చ లేదా కనుబొమ్మలా చివర పుట్టుమచ్చ ఉంటే అది అదృష్టానికి సూచిక.
ఈ పుట్టుమచ్చ ఉంటే వీరు ఎప్పుడు సంతోషంగా ఉంటారు.కనుబొమ్మల మధ్య పుట్టుమచ్చ ఉంటే వారు దీర్గాయుష్షుమంతులు అవుతారు.ఈ వ్యక్తి పురుషుడు అయితే విపరీతమైన స్త్రీ ఆదరణ కలిగి ఉంటాడు.
అదే కనుబొమ్మల మీద పుట్టుమచ్చ ఉంటే సుగుణవతి అయిన భార్య దొరుకుతుంది.భార్య మూలంగా ధన ప్రాప్తి కలుగుతుంది.
కంటి లోపల పుట్టుమచ్చ ఉన్న వాడు ఆస్తిపరుడు అవుతాడు.చెంప( Cheek ) మీద పుట్టుమచ్చ వున్నవారికి మంచి నాయకత్వ లక్షణాలు ఉంటాయి.
ముక్కు మీద పుట్టుమచ్చ ఉండే వారు ఆత్మవిశ్వాసంతో ఉంటారు.ఇంకా చెప్పాలంటే కాస్త పొగరుగా కూడా కనిపిస్తూ ఉంటారు.పెదవులకు కుడి వైపున పుట్టుమచ్చ వున్నవారు చాలా అదృష్టవంతులు.వీరికి అనుకూలమైన దంపత్య జీవితం లభిస్తుంది.చెవి మీద లేదా చెవిలో ఉన్న పుట్టుమచ్చ ఉండడం చాలా అదృష్టం.అంతే కాకుండా ఆరోగ్యమంతులు కూడా అవుతారు.
వీరు పెద్దగా ఇబ్బందులు లేని జీవితాన్ని గడుపుతారు.
LATEST NEWS - TELUGU