పెళ్ళికాని కన్నెలు గోదాదేవి కథను పారాయణ చేస్తే వారికి పెళ్ళవుతుందా?

విష్ణు చిత్తుడి కుమార్తె అయిన గోదా దేవి మానవులకు కాక దేవుడైన రంగనాథునే వివాహం చేసుకుంటానని దీక్ష పూనుతుంది.విష్ణు చిత్తుల వారు ప్రతిరోజూ స్వామివారికి పూల మాలలు అలంకరణగా తీసుకోని వెళ్ళేవారు.

 If Unmarried Girls Read Godadevis Story Will They Get Married , Devotional , G-TeluguStop.com

అయితే వాటిని గోదాదేవి ముందే ధరించి తరువాత స్వామి వారికి పంపించసాగినది.ఓ రోజు ఈ రహస్యం తండ్రి అయిన విష్ణు చిత్తుల వారికి తెలిసి చాలా దుఃఖించి స్వామి వారికి మాలాధారణ కావించరు, దానితో స్వామి మొహం చిన్నబోతుంది, దీనంతటికీ తన కుమార్తె తప్పిదమే కారణమి చాలా చాలా బాధపడుతుంటే స్వామి వారు విష్ణు చిత్తులతో అదేమీ లేదనీ.

అంతే కాకుండా ప్రతి రోజూ తనకు గోదా దేవి ధరించిన మాల ధారణే కావాలని ఆదేశిస్తారు.దానితో విష్ణు చిత్తుల వారు అలాగే చేస్తారు.

అయితే ఈ విషయం తెలియని గోదాదేవి స్వామి వారితో వివాహం కోం ధనుర్మాసంలో వేకువనే నిద్ర లేచి విష్ణు పూజ చేసి, తన అనుభవాల్నీ, భావాన్ని ఒక గేయం అంటే పాశురం రూపంలో రచించేది.ఇలా ప్రతి రోజు ఒక పాశురం చొప్పున 30 పాశురాలను రచించి వాటిని విష్ణువుకు ప్రత్యక్షమై శ్రీరంగం రమ్మనుట, ఆమె తండ్రిని తీసుకొని శ్రీరంగం వెళ్ళుట, శ్రీరంగంలో రంగనాథ స్వామితో వివాహం జరుగుట, వివాహం తరువాత గోదా దేవి రంగనాథునిలో ఐక్యం చెందుటతో కథ ముగుస్తుంది.

పెళ్ళికాని పిల్లలుఈ తిరుప్పావైను పారాయణం చేయటం వల్ల తమ కోర్కెలు నెరవేరుతాయని చెబుతారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube