అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్‌పై పరువు నష్టం దావా: వేసింది ప్రియురాలి తమ్ముడే

ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడు, అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ కుటుంబపరమైన సమస్యల్లో ఇరుక్కున్నారు.బెజోస్ ప్రియురాలు లారెన్ శాంచెజ్ సోదరుడు మైఖేల్ శాంచెజ్ ఆయనపై పరువు నష్టం దావా వేశారు.

 Amazon Jeff Bezos-TeluguStop.com

ది నేషనల్ ఎంక్వైరర్ లీక్ చేసిన ఫోటోల్లో లారెన్ శాంచెజ్ నగ్న ఫోటోలతో పాటు బెజోస్, లారెన్ సన్నిహితంగా ఉన్న ఫోటోలు కూడా ఉండటంతో కార్పోరేట్ వర్గాల్లో ఈ విషయం హాట్ టాపిక్‌‌గా మారింది.

జనవరి 2019లో ది నేషనల్ ఎంక్వైరర్ లారెన్, బెజోస్ పర్సనల్ పిక్స్‌ను బయటపెట్టడంతో పాటు వారిద్దరి వ్యక్తిగత సంభాషణకు సంబంధించిన టెక్ట్స్ మెసేజ్‌లను కూడా లీక్ చేసింది.

అయితే దీని వెనుక లారెన్ సోదరుడు మైఖేల్ ఉన్నాడని బెజోస్ ఆరోపించారు.అయితే ఈ ఆరోపణల కారణంగా తన వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగిందని మైఖేల్ తన పిటిషన్‌లో పేర్కొన్నాడు.

అంతేకాకుండా ఎఫ్‌బీఐ అధికారులు తన ఇంటిపై దాడులు చేయడంతో ఇరుగు పొరుగు వారి ముందు అవమానించబడ్డానని మైఖేల్ వ్యాఖ్యానించాడు.

Telugu Amazon, Amazonfounder, Jeff Bezos, Telugu Nri Ups, Telugu Ups-

ఈ ఆరోపణలపై లారెన్ శాంచెజ్ తన సోదరుడి పిటిషన్‌పై స్పందించారు.అతనివి నిరాధార, నిజం లేని ఆరోపణలు అని పేర్కొంది.కాగా లారెన్ శాంచెజ్ సెల్‌ఫోన్ నుంచే మైఖేల్‌కు ఫోటోలు, మెసేజ్‌లు వెళ్లినట్లు వాల్‌ స్ట్రీట్ జర్నల్ ఒక కథనంలో పేర్కొంది.

బెజోస్‌కు తనకు మధ్య జరిగిన సంభాషణలను మైఖేల్‌కు స్వయంగా లారెన్ పంపించినట్లుగా తెలిపింది.ఈ ఫోటోలు, సంభాషణల సమాచారాన్ని మైఖేల్ 2 లక్షల డాలర్లకు ది నేషనల్ ఎంక్వైరర్‌కు అమ్ముకున్నారని వాల్ స్ట్రీట్ జర్నల్ ఆరోపించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube