రాజకీయ పార్టీల నాయకుల స్పందన, విమర్శలు ఒక ఎత్తయితే టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ విమర్శలు ఒక ఎత్తు అన్నట్టుగా గమ్మత్తుగా ఉంటాయి.టిడిపి రాజకీయ ప్రత్యర్ధులు ఏవిధంగా అయితే లోకేష్ మీద పంచ్ డైలాగులు వేస్తారో అంతే రేంజ్ లో ఆయన కూడా రియాక్షన్ చూపిస్తూ ఉంటారు.
గత కొంత కాలంగా పార్టీలో కీ రోల్ పోషించేందుకు ప్రయత్నిస్తున్న లోకేష్ అమరావతి విషయంలోనూ ప్రభుత్వం పై అనేక సందర్భాల్లో పోరాటం చేసేందుకు ప్రయత్నించారు.అయితే క్షేత్రస్థాయిలో వీలు కాకపోయినా సోషల్ మీడియా ద్వారా తమ పోరాటాన్ని కొనసాగిస్తున్నాడు.
తాజాగా మూడు రాజధానులకు మద్దతుగా చంద్రబాబు సొంత గ్రామమైన నారావారిపల్లె లో వైసీపీ నాయకులు ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు.

చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని నిర్వహించగా , మంత్రులు ఎమ్మెల్యేలు భారీగా హాజరయ్యారు.ఈ సందర్భంగా వారు రాజధానుల గురించి మాట్లాడటమే కాకుండా చంద్రబాబు, లోకేష్, ఆ పార్టీ నాయకులు గురించి సంచలన వ్యాఖ్యలు చేయడంతో దీనిపై లోకేష్ స్పందించారు.ఈ సభకు భారీగా జనాలు హాజరయినట్టుగా వైసిపి అనుకూల మీడియాలో కథనాలు రాగా, ఈ సభకు పెద్దగా జనం హాజరు కాలేదని, కుర్చీలన్నీ ఖాళీగా ఉన్నాయని టీడీపీ అనుకూల మీడియా కథనాలు ప్రచురించాయి.
దీనిపైన లోకేష్ వైసీపీ కి కౌంటర్ వేశాడు.

నారావారి పల్లెలో జరిగిన సభకు సంబంధించిన వీడియో విజువల్స్ ను ఆయన తన ట్విట్టర్లో పోస్ట్ చేశారు.జఫ్ఫాలు జఫ్ఫాలు… This is వాస్తవం అంటూ ఆయన ట్విట్టర్లో పోస్ట్ పెట్టారు.ఆదివారం రంగంపేటలో వైసిపి సభలో ప్రభుత్వ ముఖ్య సలహాదారు ప్రసంగించిన తర్వాత కుర్చీలన్నీ ఖాళీగా దర్శనమిచ్చాయి.
దీంతో తన ప్రసంగాన్ని మధ్యలోనే ఆపివేయగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ఉండగానే కుర్చీలు మొత్తం ఖాళీ అయ్యాయి అన్నట్టుగా టీడీపీ అనుకూల మీడియా లో కథనాలు వచ్చాయి.దీంతో ఇప్పుడు దానికి సంబంధించిన విజువల్స్ బయట పెడుతూ లోకేష్ ఈ విధంగా స్పందించారు.







