పెరిగిన కాలుష్యం, ఆహారపు అలవాట్లు, మారిన జీవనశైలి, రసాయనాలు అధికంగా ఉండే ఉత్పత్తులను వాడటం వల్ల ఇటీవల కాలంలో చాలా మంది చిన్న వయసులోనే తెల్ల జుట్టు బారిన పడుతున్నారు.జుట్టు తెల్లబడటం స్టార్ట్ అయ్యింది అంటే మన అందం కూడా తగ్గడం స్టార్ట్ అవుతుంది.
అందుకే తెల్ల జుట్టుకు దూరంగా ఉండాలని ప్రతి ఒక్కరూ ఆరాటపడుతుంటారు.అయితే అందుకు ఇప్పుడు చెప్పబోయే ఆయిల్ చాలా అద్భుతంగా సహాయపడుతుంది.
ఈ ఆయిల్ ను వాడటం ఫాలో అయ్యారు అంటే 60 లోనూ మీ జుట్టు నల్లగా మెరుస్తుంది.మరి ఇంతకీ ఆ ఆయిల్ ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా రెండు అంగుళాల అల్లం ముక్కను( ginger ) తీసుకుని వాటర్ తో శుభ్రంగా కడిగి తడి లేకుండా ఆరబెట్టుకోవాలి.ఆ తర్వాత ఆ అల్లంను సన్నగా తురుముకోవాలి.
ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒక గ్లాస్ ఆవ నూనె పోసుకోవాలి.
అలాగే అల్లం తురుము, రెండు టేబుల్ స్పూన్లు మెంతులు( fenugreek ), వన్ టేబుల్ స్పూన్ అవిసె గింజలు( Flax seeds ) వేసి చిన్న మంటపై పది నుంచి పదిహేను నిమిషాల పాటు ఉడికించాలి.ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఆయిల్ ను స్ట్రైనర్ సహాయంతో ఫిల్టర్ చేసుకోవాలి.పూర్తిగా చల్లారిన తర్వాత ఈ ఆయిల్ ను ఒక బాటిల్ లో స్టోర్ చేసుకోవాలి.
స్కాల్ప్ తో పాటు జుట్టు మొత్తానికి ఆయిల్ ను అప్లై చేసుకుని బాగా మసాజ్ చేసుకోవాలి.మసాజ్ వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది.ఆయిల్ ను అప్లై చేసుకున్న మరుసటి రోజు మైల్డ్ షాంపూ తో తలస్నానం చేయాలి.వారానికి రెండు సార్లు ఈ ఆయిల్ ను కనుక వాడితే జుట్టులో మెలనిన్ ఉత్పత్తి తగ్గకుండా ఉంటుంది.
ఫలితంగా తెల్ల జుట్టు త్వరగా దరిచేరదు.వయసు పైబడిన కూడా మీ కురులు నల్లగా నిగనిగలాడుతూ మెరుస్తాయి.