సాధారణంగా ఒక్కోసారి స్కిన్ టాన్( Skin Tan ) అయిపోతుంటుంది.దాంతో చర్మం నల్లగా కాంతిహీనంగా కనిపిస్తుంటుంది.
అటువంటి చర్మాన్ని రిపేర్ చేసుకునేందుకు ఏం చేయాలో తెలియక తెగ హైరానా పడుతుంటారు.అయితే అలాంటి సమయంలో ఇప్పుడు చెప్పబోయే సింపుల్ టిప్స్ ను కనుక ఫాలో అయ్యారంటే నలుపుదనం పోయి మీ చర్మం తెల్లగా కాంతివంతంగా మెరిసిపోతుంది.
మరి ఇంకెందుకు ఆలస్యం ఆ టిప్స్ ఏంటో తెలుసుకుందాం పదండి.
నలుపుదనాన్ని పోగొట్టడంలో టొమాటో( Tomato ) చాలా గొప్పగా సహాయపడుతుంది.
టొమాటోను రెండు విధాలుగా ఉపయోగించి చర్మాన్ని టాన్ ను తొలగించుకోవచ్చు.అందుకోసం ముందుగా ఒక టొమాటోను తీసుకుని ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్ లో మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి.
ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు టమాటో ప్యూరీ వేసుకోవాలి.అలాగే వన్ టేబుల్ స్పూన్ గడ్డ పెరుగు,( Curd ) వన్ టేబుల్ స్పూన్ షుగర్,( Sugar ) వన్ టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్( Lemon Juice ) వేసుకొని మిక్స్ చేసుకోవాలి.
ఈ మిశ్రమాన్ని ముఖానికి మెడకు అప్లై చేసుకుని సున్నితంగా రెండు నిమిషాలు స్క్రబ్బింగ్ చేసుకోవాలి.ఆపై చర్మాన్ని పది నిమిషాల పాటు ఆరబెట్టుకుని వాటర్ తో వాష్ చేసుకోవాలి.ఈ సింపుల్ రెమెడీని పాటించడం వల్ల ట్యాన్ మొత్తం తొలగిపోతుంది.చనిపోయిన చర్మ కణాలు రిమూవ్ అవుతాయి.చర్మం తెల్లగా కాంతివంతంగా మెరుస్తుంది.మృదువుగా సైతం మారుతుంది.
అలాగే ఒక బౌల్ తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ ముల్తానీ మట్టి, రెండు టేబుల్ స్పూన్లు టమాటో ప్యూరీ మరియు రెండు టేబుల్ స్పూన్లు కొత్తిమీర జ్యూస్ వేసుకుని మిక్స్ చేసుకోవాలి.ఈ మిశ్రమాన్ని ముఖానికి మెడకు పూతలా అప్లై చేసుకుని ఆరబెట్టుకోవాలి.పూర్తిగా డ్రై అయ్యాక వాటర్ తో క్లీన్ చేసుకోవాలి.ఈ రెమెడీని పాటించిన కూడా నలుపుదనం పోతుంది.చర్మం తెల్లగా మెరిసిపోతుంది.పైగా ఈ రెమెడీ మొటిమల సమస్యకు చెక్ పెడుతుంది.
మొండి మచ్చలను మాయం చేస్తుంది.