ప్రముఖ సినిమా రచయిత పరుచూరి గోపాలకృష్ణ తన యూట్యూబ్ చానెల్ లో పలు సినిమా విషయాల గురించి తన అభిప్రాయాలను, అనుభవాలను చెప్తూ ఉన్నాడు.తాజాగా ఆయన నారప్ప సినిమా చూశాడు.
ఈ సందర్భంగా దగ్గుబాటి ఫ్యామిలీతో తనకున్న అనుబంధాన్ని వివరించాడు.రామానాయుడు నుంచి రానా దాకా.
పలువురి గురించి తన అభిప్రాయాలను వెల్లడించాడు.ఇంతకీ తను ఏం చెప్పాడో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
ఎన్టీఆర్ న దైవంగా భావిస్తే రామానాయుడు గారిని గాడ్ ఫాదర్‌గా భావించేవాళ్లమని చెప్పాడు పరుచూరి గోపాలకృష్ణ.నారప్ప సినిమాను రామానాయుడు చూసి ఉంటే వెంకటేష్ నటనను చూసి ఎంతో ఆనందపడేవారని చెప్పాడు.
రామానాయుడు ప్రపంచంలోనే బెస్ట్ జడ్జ్ అని చెప్పాడు.ఆయనకు కథ చెప్తే ఈ సినిమా హిట్టో? ఫట్టో? వెంటనే చెప్పేవాడన్నాడు.తాను రాసిన కథల గురించి ఆయన ఇచ్చినంత కచ్చితమైన జడ్జిమెంట్ ను మరెవరూ ఇవ్వలేదని చెప్పాడు.రామానాయుడుకు హిట్స్, ఫ్లాప్స్ ఉన్నాయి.అయితే సురేష్ బాబుకు 90 శాతానికి పైగా హిట్సే ఉన్నట్లు వెల్లడించాడు.సురేష్ బాబు హాలీవుడ్ స్క్రీన్ ప్లే చదువుకున్నాడా? అనే అనుమానం కలుగుతుందన్నారు.
సురేష్ బాబు చదువు కోసం విదేశాలకు వెళ్లాడు.కానీ తను విదేశాల్లో చదువుకుంది స్క్రీన్ ప్లే అని అంటాడు పరుచూరి గోపాలకృష్ణ.సినిమా పరిశ్రమలో విజయాలకు సంబంధించి తను ఓ అద్భుతాన్ని స్రుష్టించాడని చెప్పాడు.50 సినిమాలు తీస్తే అందులో 44 సూపర్ హిట్ కొట్టాయన్నాడు.
సురేష్ బాబు ప్రతిభకు ఈ సినిమా విజయాలే గుర్తింపు అన్నాడు. వెంకటేశ్ అద్భుత నటన కలిగిన వ్యక్తి అని చెప్పాడు.అతడిల ఓ వివేకానందుకు ఉన్నట్లు వెల్లడించాడు.కలిసుందాంరా, ప్రేమించుకుందాం రా, ప్రేమంటే ఇదేరా, గణేష్, నారప్ప ఏ సినిమాకు ఆనటన కనబరుస్తాని చెప్పాడు.అటు రామానాయుడు చనిపోయిన ఏడాది జులైలోనే బాహుబలి సినిమా విడుదల అయినట్లు చెప్పాడు పరుచూరి గోపాలకృష్ణ.ఈ సినిమాలో రానా నటన చూసి ఉంటే రామానాయుడు ఎంతో సంతోష పడేవాడని చెప్పాడు.