బాన పొట్టను 20 రోజుల్లో ఫ్లాట్ గా మార్చే బెస్ట్ ఫ్యాట్ కట్టర్ డ్రింక్ మీ కోసం!

బాన పొట్టతో బాధపడుతున్నారా.? పొట్టను తగ్గించుకోవడం కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారా.? అయితే అస్స‌లు చింతించకండి.ఎందుకంటే ఇప్పుడు చెప్పబోయే ఫ్యాట్ కట్టార్‌ డ్రింక్ ను ఇర‌వై రోజులపాటు వరసగా తీసుకుంటే ఎంతటి బాన పొట్ట అయినా ఫ్లాట్ గా మారడం ప్రారంభమవుతుంది.

 The Best Fat Cutter Drink That Will Make Your Belly Flat In 20 Days! Fat Cutter-TeluguStop.com

ఇంకెందుకు ఆలస్యం ఆ ఫ్యాట్ కట్టర్ డ్రింక్ ను ఎలా త‌యారు చేసుకోవాలి.? మరియు ఎప్పుడు దాన్ని తీసుకోవాలి.? అన్న విష‌యాల‌పై ఓ లుక్కేసేయండి.

ముందుగా ఒక యాపిల్ ను తీసుకుని నీటిలో శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.

అలాగే ఒక ఆరెంజ్ పండును తీసుకుని తొక్క తొలగించి లోపల ఉండే పల్ప్ ను సపరేట్ చేసుకోవాలి.ఆ తర్వాత బ్లెండ‌ర్ లో కట్ చేసి పెట్టుకున్న యాపిల్ ముక్కలు, ఆరెంజ్ పల్ప్, అర అంగుళం పీల్ తొలగించిన పచ్చి పసుపు కొమ్ము, అర అంగుళం పీల్ తొలగించిన అల్లం ముక్క, నాలుగు దంచిన మిరియాలు, మూడు గింజ తొలగించిన ఖర్జూరాలు, చిటికెడు బ్లాక్ సాల్ట్, ఒక గ్లాస్‌ వాటర్ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

Telugu Belly Fat, Fat Cutter, Flat Stomach, Tips, Latest-Telugu Health

ఇలా గ్రైండ్ చేసుకున్న జ్యూస్ లో వన్ టేబుల్ స్పూన్ తేనె కలిపితే మన ఫ్యాట్ కట్టర్ డ్రింక్ సిద్దమవుతుంది.రోజు బ్రేక్ ఫాస్ట్ కు గంట ముందు ఈ ఫ్యాట్ కట్టర్ డ్రింక్ ను తీసుకోవాలి.త‌ద్వారా ఇర‌వై రోజుల్లోనే మీ బాన పొట్ట ఫ్లాట్ గా మారడాన్ని మీరు గమనిస్తారు.పొట్ట వద్ద పేరుకుపోయిన కొవ్వును కరిగించడానికి ఈ డ్రింక్ ఎంతో ఉత్తమంగా సహాయపడుతుంది.

Telugu Belly Fat, Fat Cutter, Flat Stomach, Tips, Latest-Telugu Health

పైగా ఈ డ్రింక్ ను తీసుకోవడం వల్ల డైజెస్టివ్ సిస్టమ్‌ ఇంప్రూవ్ అవుతుంది.మలబద్ధకం సమస్య ఉంటే దూరం అవుతుంది.వెయిట్ లాస్ అవుతారు.బ్యాడ్ కొలెస్ట్రాల్ క‌రిగి గుండె ఆరోగ్యంగా మారుతుంది.క్యాన్సర్ వచ్చే రిస్క్ తగ్గుతుంది.అధిక రక్తపోటు అదుపులోకి వస్తుంది.

ఎముక‌లు ఆరోగ్యంగా మారతాయి.ఎముకల సాంద్రత సైతం పెరుగుతుంది.

కాబ‌ట్టి, బెల్లీ ఫ్యాట్ తో బాధపడుతున్న వారు మాత్రమే కాదు ఎవ్వరైనా ఈ డ్రింక్ ను తమ డైట్ లో చేర్చుకోవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube