ఏటిపి జేసి ప్రభాకర్ రెడ్డి ప్రెస్ మీట్

తాడిపత్రి నియోజకవర్గంలోని పెన్నా నదిలో ఇసుక అక్రమాలను తాను నిరూపిస్తానని అలా నిరూపించలేక పోతే ఊరు నుంచి బహిష్కరించండి అంటూ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి సవాల్ విసిరారు.పెద్దపప్పూరు లో ఇసుక అక్రమాలను చూసేందుకు వెళ్తే నాపై ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టారని అసలు అక్కడ ఏం జరరుగుతోందో ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు.

 Atp Jc Prabhakar Reddy Press Meet , Jc Prabhakar Reddy, Penna River, Tadipatri-TeluguStop.com

పెద్దపప్పూరు వద్ద పెన్నా నదిలో జరుగుతున్న ఇసుక అక్రమాలు గురించి ఆయన వివరంగా తెలియజేశారు.ప్రభుత్వ నిభందన ప్రకారం ఇసుకను మనుషులతోనే రోజుకు 20 మంది చొప్పున తవ్వాలని.300 రోజులు ఉదయం 8గం|| నుండి సా॥ 5గం|| వరకు మాత్రమే లోడింగ్ చేయాలన్నారు.ఒక రోజుకు వీరికి 75 ట్రాక్టర్లు లేదా 15 టిప్పర్లు మాత్రమే తోలుకోవాలన్నారు.కానీ అక్కడ మాత్రం 200 హెచ్పి సామర్ధ్యం గల ఐదు మిషన్ లతో రాత్రింబవళ్ళు పని చేస్తున్నాయని.200 టిప్పర్లు మరియు 80 ట్రాక్టర్లు లోడింగ్ చేస్తున్నాయన్నారు.పెన్నానదిలో లోడింగ్ వరకు 23 టన్నుల ఇసుకకు 8550 రూపాయలు వసూలు చేస్తున్నారని.కానీ మార్కెట్ లో డిమాండ్ ని బట్టి 16వేలు నుండి 40వేల వరకు దండుకుంటు న్నారన్నారు.

ఇప్పటికే ఈ ప్రాంతంలో పెద్దపెద్ద గుంతలు ఏర్పడి చాలామంది ప్రాణాలు కోల్పోయే పరిస్థితి కూడా వచ్చిందన్నారు.ఇక్కడ రైతులు ఈ పరిస్థితి చూసి ఆత్మహత్య చేసుకుంటామని అంటున్నారని నేను కూడా వారితో కలిసి వెళ్లి నీటిలో దూకుతానంటూ జేసి ప్రభాకర్ రెడ్డి అన్నారు.

ఇసుక తవ్వకాలు అక్రమాల నియంత్రణ కోసం మొత్తం 13 మంది అధికారులు బాధ్యతగా ఉంటారని అయితే వారు దీనిపై ఏం సమాధానం చెబుతారని ఆయన ప్రశ్నించారు.వీరికి నోటీసులు కూడా పంపించమని రెండు రోజుల్లో సమాధానం చెప్పకపోతే తానే స్వయంగా వీటిని ప్రజలకు తెలియజేసే ప్రయత్నం చేస్తానన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube