టాలీవుడ్ లో వారుసుల హావ ఎంతగా ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.సీనియర్ హీరోలు మాత్రమే కాదు నిర్మాతలు, దర్శకులు కూడా తమ కుమారులను హీరోలుగా వెండితెరకు పరిచయం చేస్తుంటారు.
దాసరి నారాయణరావు, కె.రాఘవేంద్రరావు, ఎ.కోదండరామిరెడ్డి తమ కుమారులను వెండి తెరకు హీరోగా పరిచయం చేశారు.కానీ వారంతా కూడా ఎంతో కాలం సినిమాల్లో హీరోగా కొనసాగలేకపోయారు.
దాసరి నారాయణరావు తన కుమారుడైన దాసరి అరుణ్ కుమార్ తో ఎన్నో సినిమాలను తెరకెక్కించారు.కానీ నటుడిగా దాసరి అరుణ్ కుమార్ అసలు రాణించలేకపోయారు.హీరోగా మాత్రమే కాదు క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా ఆయన నటించ లేక చిత్ర పరిశ్రమకు పూర్తిగా దూరం అయ్యారు.
ప్రముఖ దర్శకుడు కె.రాఘవేంద్రరావు తన కుమారుడైన ప్రకాష్ కోవెలమూడి ని స్టార్ హీరో చేయాలని ఎంతో తపన పడ్డారు.తన కుమారుడిని గొప్ప నటుడిగా నిలబెట్టాలని రాఘవేంద్రరావు చేసిన ప్రయత్నాలు లేవు.
కానీ ప్రకాష్ కోవెలమూడి నటనారంగంలో కొనసాగలేకపోయారు.దీంతో బాగా విసిగి పోయిన రాఘవేంద్రరావు ప్రకాష్ చేత డైరెక్షన్ చేయించడం ప్రారంభించారు.
కానీ ప్రకాష్ కోవెలమూడి దర్శకుడిగా కూడా విజయం సాధించలేకపోయారు.
ఎ.కోదండరామిరెడ్డిచిరంజీవి వంటి హీరోలకు కూడా స్టార్ డం తెచ్చిపెట్టారు.అయితే తన కుమారుడిని కూడా గొప్ప హీరోగా నిలబెట్టాలని వైభవ్ రెడ్డి ని వెండితెరకు పరిచయం చేశారు.2007వ సంవత్సరంలో కోదండరామిరెడ్డి దర్శకత్వంలోనే తెరకెక్కిన గొడవ సినిమాలో మొదటిసారిగా వైభవ్ రెడ్డి కనిపించారు.అయితే ఈ సినిమా డిజాస్టర్ కావడంతో వైభవ్ రెడ్డి కి నటుడిగా గుర్తింపు దక్కలేదు.
ముంబైలోని ఆశా చంద్ర స్కూల్ అఫ్ యాక్టింగ్ తో పాటు వైజాగ్ లోని సత్యానంద్ వద్ద నటనలో శిక్షణ పొందిన వైభవ్ రెడ్డి తమిళ సినిమాల్లో నటించి నటుడిగా గుర్తింపు పొందారు.కానీ ఆయన తెలుగులో సక్సెస్ కాలేకపోయారు.
రీమేక్ సినిమాలను అత్యద్భుతంగా తెరకెక్కించడంలో దిట్ట అయిన దర్శకుడు రవిరాజా పినిశెట్టి తన ఇద్దరు కుమారులు అయిన ఆది పినిశెట్టి ని హీరోగా సత్య ప్రసాద్ పినిశెట్టి ని దర్శకుడిగా చేయాలనుకున్నారు.అయితే ఆది పినిశెట్టి తెలుగులో ఎన్నో సినిమాల్లో నటించినా హీరోగా గుర్తింపు దక్కలేదు.దాంతో ఆయన తమిళ సినిమాల్లో నటిస్తూ బాగానే గుర్తింపు దక్కించుకున్నారు.ప్రస్తుతం సపోర్టింగ్ క్యారెక్టర్ లలో నటిస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు దక్కించుకుంటున్నారు.సత్య ప్రభాస్ పినిశెట్టి మాత్రం ఒకే ఒక సినిమాను తెరకెక్కించి చిత్ర పరిశ్రమకు దూరం అయిపోయారు.
.