ప్రస్తుతం ఇండియన్ సినిమా పరిశ్రమలో తెలుగు పరిశ్రమ అత్యంత ప్రతిష్టాత్మక సినిమాలు తెరకెక్కిస్తుంది.తెలుగులో తెరకెక్కిన పలు సినిమాలు ఈజీగా 100 నుంచి 200 కోట్ల రూపాయల లైన్ ను క్రాస్ చేస్తున్నాయి.
ఇప్పటి వరకు టాలీవుడ్ లో 100 నుంచి 300 కోట్ల రూపాయల మార్క్ ను అచీవ్ చేసిన దర్శకులు ఎవరో ఇప్పుడు చూద్దాం.వీరందరినీ నాన్ బాహుబలి సినిమాగా చూడాలి.
త్రివిక్రమ్

మాటల మాంత్రికుడు త్రివిక్రం మూడు సినిమాలు 100 కోట్లు పైన వసూళ్లు సాధించాయి.అత్తారింటికి దారేది 135 కోట్లు, అరవింద సమేత 155 కోట్లు, అలవైకుంఠ పురంలో 2784 కోట్లు సాధించింది.
సుకుమార్

రాం చరణ్ హీరోగా సుకుమార్ తీసిని రంగంస్థలం సినిమా ప్రపంచ వ్యాప్తంగా 213 కోట్ల రూపాయలను సాధించింది.
వివి వినాయక్

మాస్ సినిమాల దర్శకుడు చాలా గ్యాప్ తర్వాత చిరంజీవితో కలిసి చేసిన సినిమా ఖైదీ నెం.150.ఈ సినిమా 165 కోట్లు కలెక్ట్ చేసింది.
ఎస్ ఎస్ రాజమౌళి

టాలీవుడ్ దర్శక ధీరుడు తీసిన రెండు సినిమాలు 100 కోట్ల మార్కును దాటాయి.అందులో మగధీర 129 కోట్లు సాధించగా.ఈగ 102 కోట్లు సాధించింది.
కొరాటల శివ

ఈ దర్శకుడు తెరకెక్కించిన శ్రీమంతుడు సినిమా 151 కోట్లు సాధించగా.జనతా గ్యారేజ్ 130 కోట్లు, భరత్ అనే నేను 178 కోట్లు వసూలు చేసింది.
సురేందర్ రెడ్డి

ఇతడు తెరకెక్కించిన సైరా సినిమా 248 కోట్లు వసూలు చేయగా.రేసుగుర్రం 105 కోట్లుకొల్లగొట్టింది.
పరుశురాం

ఇతడు తీసిన గీతా గోవిందం సినిమా ద్వారా 126 కోట్లు సాధించాడు.
బోయపాటి శ్రీను

మాస్ దర్శకుడు బోయపాటి తీసిన సరైనోడు సినిమా 131 కోట్లను సాధించింది.
హరీష్ శంకర్

పవన్ కల్యాణ్ తో తీసిన గబ్బర్ సింగ్ సినిమా 108 కోట్లు సాధించగా.బన్ని హీరోగా చేసిన డీజే సినిమా 119 కోట్లు కొల్లగొట్టింది.
అనిల్ రావిపూడి

ఇతడు తీసిన ఎఫ్-2 సినిమా 140 కోట్లు సాధించగా.సరిలేరు నీకెవ్వరు 237 కోట్లు వసూలు చేసింది.
శ్రీనువైట్ల

మహేష్ బాబుతో కలిసి తీసిన ఇతడి సినిమా దూకుడు 101 కోట్లు వసూలు చేసింది.
బాబీ

బాబీ తెరకెక్కించిన లవకుశ సినిమా 130 కోట్లు సాధించింది.