సావిత్రి కోమాలోకి వెళ్లిన రోజు ఏం జరిగిందో చెప్పిన సీనియర్ నటి లక్ష్మీ

సావిత్రి.తెలుగు సినిమా పరిశ్రమలో దిగ్గజ నటీమణి.పాత తరం హీరోయిన్లకు తను ఆదర్శం.మహా నటిగా గుర్తింపు పొందిన తార సావిత్రి.అప్పట్లో సినిమా రంగంలోకి అడుగు పెట్టేవారు.సావిత్రిలా పెద్ద ఆర్టిస్టు కావాలి అనుకుంటున్నట్లు చెప్పేవారు.

 What Happened On The Day When Savitri Went To Coma , Lakshmi, Savitri , Mysore-TeluguStop.com

సావిత్రిని మించి నటించే వారు ఇప్పటికీ తెలుగు సినిమా పరిశ్రమలో మరొకరు రాలేదంటే అతిశయోక్తి కాదు.మాటను ఎవ్వరూ కాదనలేరు కూడా.

మహానటి అనే మాటకు నిలువెత్తు నిదర్శనం ఆమె.సీనియర్ నటి లక్ష్మీ కూడా ఇదే విషయాన్ని వెల్లడించింది.8 ఏండ్ల వయసు నుంచి తనతో పరిచయం ఉందని చెప్పింది.ఆమె దగ్గర తనకు చనువు కూడా ఎక్కువగానే ఉండేదన్నది.

ఆమెతో కలిసి బాంధవ్యాలు అనే సినిమాలో నటించింది లక్ష్మీ.ఆ తర్వాత పుట్టినిల్లు-మెట్టినిల్లు అనే సినిమాలోనూ కలిసి నటించారు.

అయితే చందనగొంబె అనే కన్నడ మూవీ షూటింగ్ జరిగే రోజుల్లో ఓ ఘటన జరిగినట్లు లక్ష్మీ వెల్లడించింది.ఆ ఘటనను తాను ఎప్పటికీ మర్చిపోలేనని చెప్పింది.మైసూరు స్టూడియోలో షూటింగ్ జరుగుతుండగా.సావిత్రి, లక్ష్మి అక్కడికి వెళ్లారు.

లక్ష్మీ షూటింగ్ అయిపోయింది.ఆమె మద్రాసుకు వెళ్లిపోదామనుకుంటున్నట్లు సావిత్రితో చెప్పింది.

ఈ ఒక్క రోజు ఇక్కడే ఉంటే రేపు ఉదయం ఇద్దరం కలిసి వెళ్దామని చెప్పింది సావిత్రి.అయితే తనకు చాలా ముఖ్యమైన పని ఉందని చెప్పి.

లక్ష్మీ వెళ్లిపోయింది.అదే రోజు సావిత్రి కోవాలోకి వెళ్లిపోయింది.

బెంగళూరు హాస్పిటల్లో జాయిన్ చేసినట్లు వార్తలు వచ్చాయి.వెంటనే లక్ష్మీ కారులో బెంగళూరుకు తిరిగి వెళ్లింది.

Telugu Lakshmi, Mysore Studio, Savitri, Tollywood, Veeraswamy-Telugu Stop Exclus

లక్ష్మీ బెంగళూరుకు వెళ్లే సరికి సావిత్రి జనరల్ వార్డు హాల్లో నేల మీద పడుకొని ఉంది.ఆ సీన్ చూసి లక్ష్మీ కంటతడి పెట్టింది.కోపం వచ్చింది.అంతలోనే అక్కడికి ప్రముఖ కన్నడ నిర్మాత వీరస్వామి అక్కడికి వచ్చాడు.వీరిద్దరు కలిసి హాస్పిటల్ సిబ్బందిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ ఘటన జరిగింది 1980లో.అప్పుడు తను కోలుకున్నారు.1981లో మళ్లీ తను కోవాలోకి వెళ్లి చనిపోయింది.తను ఆ రోజు సావిత్రితో ఉంటే పరిస్థితి ఇలా ఉండేది కాదు అని చెప్పింది లక్ష్మీ.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube