టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ సర్కారు వారి పాట ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.ఈ సినిమాను దర్శకుడు పరశురామ్ తెరకెక్కిస్తుండగా, ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్లు ఈ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశాయి.
ఇక ఈ సినిమాతో మరోసారి టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద మహేష్ తనదైన మార్క్ వేయడం ఖాయమని చిత్ర యూనిట్ అంటోంది.కాగా ఇటీవల సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు కానుకగా ‘సూపర్ స్టార్ బర్త్‌డే బ్లాస్టర్’ అంటూ ఓ టీజర్ గ్లింప్స్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.
ఈ టీజర్ గ్లింప్స్‌కు అభిమానులతో పాటు ప్రేక్షకుల దగ్గర్నుండి అదిరిపోయే రెస్పాన్స్ దక్కింది.ముఖ్యంగా ఈ టీజర్ గ్లింప్స్‌లో మహేష్ అల్ట్రా స్టైలిష్ లుక్‌తో దర్శనమివ్వడంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా రెడీ అవుతున్నారు.
ఇక ఈ టీజర్‌ను యూట్యూబ్‌లో మహేష్ ఫ్యాన్స్ ట్రెండింగ్‌లో ఉంచుతూ అదిరిపోయే వ్యూస్‌తో సరికొత్త రికార్డును క్రియేట్ చేశారు.ఈ టీజర్‌కు ఇప్పటివరకు ఏకంగా 33 మిలియన్ కంటే ఎక్కువ వ్యూస్‌తో పాటు 950+K లైకులు రావడం విశేషం.
దీన్ని బట్టి సర్కారు వారి పాట సినిమా కోసం ప్రేక్షకులు ఏ రేంజ్‌లో ఎదురుచూస్తున్నారో అర్థం చేసుకోవచ్చు.
ఇక ఆర్థిక నేరాల చుట్టూ తిరిగే ఈ కథలో మహేష్ అదిరిపోయే పర్ఫార్మె్న్స్ ఇచ్చాడని, ఈ సినిమాలో ఆయన ఓ కంపెనీ ఓనర్‌గా కనిపిస్తాడని తెలుస్తోంది.
ఆయన కంపెనీలో హీరోయిన్ కీర్తి సురేష్ పని చేస్తుందని, దీంతో ఆమె తన ఓనర్‌నే ప్రేమిస్తుందనే టాక్ చిత్ర వర్గాల్లో వినిపిస్తోంది.ఈ సినిమాకు థమన్ అందించే సంగీతం మరో లెవెల్‌లో ఉండబోతుందని రిలీజ్ అయిన టీజర్ బీజీఎం చూస్తే తెలుస్తోంది.
వచ్చే సంక్రాంతికి రిలీజ్ ఫిక్స్ చేసుకున్న సర్కారు వారి పాట సరికొత్త రికార్డులు క్రియేట్ చేయడంలో తగ్గేదే లే అంటోంది.