ప్రస్తుతం అన్ని రంగాలతో పాటే సినిమా రంగంలోనూ విపరీతమైన పోటీ నెలకొంది.వరుస విజయాలతో వెళ్తేనే గుర్తింపు ఉంటుంది.
రెండు ఫ్లాపులు వచ్చాయంటే అడ్రస్ గల్లంతు అవుతుంది.కానీ.
చాలా మంది హీరోలు వరుసగా ఫ్లాపులు వచ్చినా.మళ్లీ హిట్స్ తో కం బ్యాక్ ఇచ్చిన హీరోలు ఉన్నారు.ఇంతకీ వారెవరో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
*2012లో సుడిగాడు సినిమాతో హిట్ కొట్టిన అల్లరి నరేష్.2021లో వచ్చిన నాంది సినిమా వరకు వెయిట్ చేయాల్సి వచ్చింది.
* 2017లో రాజా ది గ్రేట్ సినిమాతో హిట్ కొట్టిన రవితేజ. 2021లో క్రాక్ సినిమా వరకు వెయిట్ చేయాల్సి వచ్చింది.
*2007లో దేశముదురు సినిమాతో హిట్ కొట్టిన అల్లు అర్జున్.ఆ తర్వాత 2012లో వచ్చిన జులాయి వరకు వెయిట్ చేశాడు.
*2001లో వచ్చిన ఖుషి సినిమా హిట్ తర్వాత.2012లో గబ్బార్ సింగ్ సినిమా వరకు పవన్ కళ్యాణ్ వెయిట్ చేయాల్సి వచ్చింది.
* 2003లో వచ్చిన సింహాద్రితో హిట్ కొట్టిన ఎన్టీఆర్.
2007లో వచ్చిన యమదొంగ వరకు వెయిట్ చేయాల్సి వచ్చింది.
* 2006లో వచ్చిన పోకిరి సినిమా హిట్ కొట్టిన మహేష్ బాబు.
2011లో వచ్చిన దూకుడు సినిమా వరకు వెయిట్ చేశాడు.
* 2004లో వచ్చిన సై సినిమాతో హిట్ నితిన్.
ఆ తర్వాత 2012లో వచ్చిన ఇష్క్ వరకు వెయిట్ చేశాడు.
* 2015 లో వచ్చిన సుప్రీం తర్వాత.2019లో వచ్చిన చిత్రలహరి సినిమా వరకు హిట్ కోసం వెయిట్ చేశాడు సాయి ధరమ్ తేజ్.
* 2016 లో వచ్చిన నేను శైలజ సినిమా తర్వాత రామ్ పోతినేని.
2019లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ వరకు వెయిట్ చేశాడు.
* 2005లో వచ్చిన ఛత్రపతి సినిమా తర్వాత.ప్రభాస్ మరో హిట్ కోసం 2010లో వచ్చిన డార్లింగ్ వరకు ఆగాల్సి వచ్చింది.
*2013లో వచ్చిన నాయక్ తో హిట్ కొట్టిన రామ్ చరణ్.2018 లో వచ్చిన రంగస్థలం సినిమా వరకు వెయిట్ చేయాల్సి వచ్చింది.
*1993లో వచ్చిన అబ్బాయి గారు హిట్ తర్వాత 1996లో వచ్చిన పవిత్ర బంధం సినిమా వరకు వెంకటేష్ ఆగాడు.
*1993లో వచ్చిన ముఠామేస్త్రి సినిమా తర్వాత.1997లో వచ్చిన హిట్లర్ సినిమా వరకు చిరంజీవి ఆగాల్సి వచ్చింది.
*1989లో వచ్చిన శివ సినిమా తర్వాత.1992లో వచ్చిన ప్రెసిడెంట్ గారి పెళ్ళాం సినిమా వరకు నాగార్జున వెయిట్ చేశాడు.
*2004లో వచ్చిన లక్ష్మీ నరసింహ తర్వాత.2010లో వచ్చిన సింహ సినిమా వరకు బాలకృష్ణ ఆగాల్సి వచ్చింది.