డస్ట్ అలెర్జీ.( Dust Allergy ) ఇది చిన్న సమస్యగా అనిపించిన దాన్ని అనుభవించే వారి బాధ మాత్రం వర్ణనాతీతం.
డస్ట్ అలెర్జీ ఉన్న వ్యక్తుల తుమ్ములు ( Sneezing ) గురించి మనకు బాగా తెలుసు.కానీ తుమ్ములు మాత్రమే లక్షణం కాదు.
ముక్కు కారడం లేదా మూసుకుపోవడం, కళ్ళు దురద, కళ్ళు ఎరుపెక్కడం, కళ్ల నుంచి నీరు కారడం, గురక, దగ్గు, ఛాతీలో బిగుతుగా ఉండటం, శ్వాస ఆడకపోవడం, గొంతు బొంగురు పోవడం తదితర లక్షణాలు సైతం ఇబ్బంది పెడతాయి.అందుకే డస్ట్ అలెర్జీ ఉన్నవారు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి.
ఇంటిని, ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి.పెంపుడు జంతువులకు దూరంగా ఉండాలి.బయటకు వెళ్లే సమయంలో మరియు ఇంటిని శుభ్రం చేసే సమయంలో మాస్క్( Mask ) ధరించాలి.బెడ్ షీట్స్, పిల్లో కవర్స్, కర్టెన్స్ ను ఎప్పటికప్పుడు మారుస్తూ ఉండాలి.
ఇంటిలో 50 శాతం కంటే తక్కువ తేమను నిర్వహించాలి.డీహ్యూమిడిఫైయర్ లేదా ఎయిర్ కండీషనర్ తేమను తక్కువగా ఉంచడంలో సహాయపడతాయి.
ఇకపోతే డస్ట్ అలెర్జీ ఉన్నవారు కొన్ని కొన్ని ఇంటి చిట్కాలు పాటించడం ద్వారా దాని లక్షణాల నుంచి బయటపడవచ్చు.యూకలిప్టస్ ఎసెన్షియల్ ఆయిల్( Eucalyptus Essential Oil ) మరియు లావెండర్ ఎసెన్షియల్ ఆయిల్( Lavender Essential Oil ) వంటి ముఖ్యమైన నూనెలు డస్ట్ అలర్జీ మరియు ఇతర సారూప్య శ్వాసకోశ రుగ్మతల చికిత్సలో ప్రయోజనకరంగా ఉంటాయి.అందువల్ల డస్ట్ అలెర్జీతో బాధపడేవారు వాటర్ లో ఆ ఆయిల్స్ వేసి ఆవిరి పడుతూ ఉండాలి.దాంతో శ్వాస నాళం క్లియర్ అవుతుంది.శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తొలగిపోతాయి.తుమ్ములు, ముక్కు కారడం వంటి సమస్యలు దూరం అవుతాయి.
అలాగే గోరువెచ్చని నీటిలో స్వచ్ఛమైన తేనె( Pure Honey ) కలిపి ప్రతి రోజూ తీసుకోవడం వల్ల డస్ట్ అలెర్జీ లక్షణాలు కంట్రోల్లో ఉంటాయి.డస్ట్ అలెర్జీతో బాధపడే వారికి అల్లం టీ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.రోజుకు ఒక కప్పు అల్లం టీ తాగితే దగ్గు, గురక దూరం అవుతాయి.శ్వాస మార్గంలో అడ్డంకులు తొలగిపోతాయి.
ఇక యాపిల్ సైడర్ వెనిగర్ లో ఉండే యాంటీ మైక్రోబయల్ గుణాలు డస్ట్ అలెర్జీ తీవ్రతను సులభంగా నిరోధించగలవు.కాబట్టి, ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో వన్ టేబుల్ స్పూన్ యాపిల్ సైడర్ వెనిగర్ కలిపి తీసుకునేందుకు ప్రయత్నించండి.