స్ట్రెచ్ మార్క్స్.ప్రసవం అనంతరం దాదాపు ప్రతి మహిళా కామన్‌గా ఎదుర్కొనే సమస్య ఇది.ప్రెగ్నెన్సీ కారణంగా పొట్ట సాగడంతో స్ట్రెచ్ మార్క్స్ ఏర్పడుతుంటాయి.ఇవి చూసేందుకు కాస్త అసహ్యంగా కనిపిస్తాయి.
అందుకే పొట్టపై ఏర్పడిన స్ట్రెచ్ మార్క్స్ ను తొలగించి అక్కడి చర్మాన్ని టైట్‌గా మార్చుకునేందుకు ఖరీదైన క్రీములు, లోషన్లు వాడతారు.అయితే ఎన్ని యూజ్ చేసినా కొందరిలో స్ట్రెచ్ మార్క్స్ పోనే పోవు.
అలాంటి వారికి ఆప్రికాట్స్ అద్భుతంగా సహాయపడతాయి.
ఈ పండ్లలో ఉండే ప్రత్యేక సుగుణాలు పొట్టపై ఏర్పడిన స్ట్రెచ్ మార్క్స్ ను శాశ్వతంగా వదిలించేందుకు గ్రేట్‌గా హెల్ప్ చేస్తాయి.
మరి ఇంతకీ ఆప్రికాట్స్‌ను ఎలా వాడాలో తెలుసుకుందాం పదండీ.ముందుగా రెండు ఆప్రికట్స్ తీసుకుని గింజ తొలగించి.
లోపల ఉన్న గుజ్జు మాత్రం తీసుకోవాలి.ఇప్పుడు ఇందులో వన్ టేబుల్ స్పూన్ రోజ్ వాటర్, వన్ టేబుల్ స్పూన్ విటమిన్ ఇ ఆయిల్ వేసుకుని అన్నీ కలిసేలా మిక్స్ చేసుకోవాలి.
ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని పొట్టపై అప్లై చేసి స్మూత్‌గా నిమిషం పాటు మసాజ్ చేయాలి.ఇరవై నిమిషాల అనంతరం గోరు వెచ్చని నీటితో చర్మాన్ని క్లీన్ చేసుకుని ఏదైనా మాయిశ్చరైజర్ లేదా నెయ్యిని రాసుకోవాలి.
ఇలా ప్రతి రోజు చేస్తే గనుక స్ట్రెచ్ మార్క్స్ క్రమంగా తగ్గిపోయి చర్మం స్మూత్‌గా మారుతుంది.

అలాగే మరో విధంగా కూడా ఆప్రిక్సట్‌ను యూజ్ చేయవచ్చు.రెండు గింజ తొలగించిన ఆప్రికాట్స్‌ను తీసుకుని మిక్సీ జార్‌లో వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి.ఈ పేస్ట్‌లో వన్ టేబుల్ స్పూన్ బాదం పొడి, రెండు టేబుల్ స్పూన్ల తేనె వేసుకుని కలుపుకోవాలి.
ఇప్పుడు ఈ మిశ్రమాన్ని పొట్టకు రాసి.అర గంట పాటు వదిలేయాలి.
ఆపై నార్మల్ వాటర్‌తో వాష్ చేసుకుని.మాయిశ్చరైజర్‌ను రాసుకోవాలి.
ఇలా చేసినా కూడా మంచి ఫలితం ఉంటుంది.