ఆ సమయంలో జబర్దస్త్ నుంచి తీసేశారు.. తిరుపతి ప్రకాష్ ఎమోషనల్ కామెంట్స్!

తెలుగు ప్రేక్షకులకు టాలీవుడ్ కమెడియన్ తిరుపతి ప్రకాష్( Comedian Tirupati Prakash ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.తెలుగులో కొన్ని సినిమాలతో పాటు సీరియల్స్ లో కూడా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు ప్రకాష్.

 Tirupathi Prakash About Jabardasth Show, Tirupathi Prakash, Jabardasth, Jabardas-TeluguStop.com

తనదైన శైలిలో కామెడీ చేస్తూ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు.ఈ మధ్యకాలంలో అవకాశాలు రావడంతో పాటు కొత్త కమెడియన్లు సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వడంతో ప్రకాష్ కి అవకాశాలు పెద్దగా రావడం లేదు.

దీంతో కేవలం అడపా సినిమాలలో మాత్రమే నటిస్తున్నారు.అలాగే కొన్ని కొన్ని సీరియల్స్ లో మాత్రమే నటిస్తున్నారు తిరుపతి ప్రకాష్.

తిరుపతి ప్రకాష్ జబర్దస్త్ లో( Jabardasth ) చేశారు కానీ సడెన్ గా ఆగిపోయారు.అయితే జబర్దస్త్ నుంచి ఎందుకు ఆగిపోవాల్సి వచ్చిందో కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

Telugu Jabardasth, Jabardasth Show, Naughty Naresh, Punch Prasad, Tirupatiprakas

ఈ సందర్భంగా ఇంటర్వ్యూలో భాగంగా తిరుపతి ప్రకాష్ మాట్లాడుతూ.ఆ రోజు జబర్దస్త్ కమెడియన్ అండ్ రైటర్ ఆటో రామ్ ప్రసాద్ ఇంటి గృహ ప్రవేశం జరిగింది.అయితే రెండు రోజుల తర్వాత స్కిట్స్ షూటింగ్ ఉంది.ఇంతలో హీరో శ్రీకాంత్ ఫోన్ చేసి అమెరికాలో ప్రోగ్రాం ఉంది అక్కడకి ఆర్టిస్టులను తీసుకెళ్లి పెర్ఫార్మ్ చేస్తావా అని అడిగారు.

అయితే ఆ గృహ ప్రవేశానికి జబర్దస్త్ డైరెక్టర్స్ వచ్చారు అప్పుడు నేను వాళ్ళను అడిగాను అవకాశం ఇస్తే అమెరికా వెళ్లి అక్కడ స్కిట్స్ చేస్తాను అన్నాను.ఎందుకంటే ఆల్రెడీ జబర్దస్త్ లో 2,3 నెలలకి స్కిట్స్ బ్యాకప్ ఉంటుంది.

కాబట్టి అమెరికా వెళ్లి చేసి వచ్చాక జబర్దస్త్ లో జాయిన్ అవుతాను అని చెప్పాను.కాదు కుదరదు అన్నారు సరే ఆ ప్లేస్ లో బులెట్ భాస్కర్ వాళ్ళు వెళ్లారు.

Telugu Jabardasth, Jabardasth Show, Naughty Naresh, Punch Prasad, Tirupatiprakas

ఆ తర్వాత రోజు జబర్దస్త్ స్కిట్స్ రాసుకుని రిహార్సల్స్ చేసాం అన్నీ అయ్యాయి.రెండో రోజు షూటింగ్ కి బయలుదేరాలి ఇంతలో జబర్దస్త్ కి సంబంధించిన ఒక మేనేజర్ ఫోన్ చేసాడు.ఈరోజు మీ స్కిట్స్ ఆపేశారండి అని డైరెక్టర్ గారు చెప్పామన్నారు అని చెప్పాడు.కట్ చేస్తే పంచ్ ప్రసాద్,( Punch Prasad ) నాటీ నరేష్( Naughty Naresh ) ఎప్పటి నుండో టీమ్ లీడర్ ఇవ్వండి అంటూ అడుగుతున్నారట.

వాళ్ళ కోసం నన్ను తీసేసారు అన్న విషయం నన్ను ఆపేసాక నా ప్లేస్ లో వచ్చినవాళ్ళను చూసాక అర్ధమయ్యింది.

Telugu Jabardasth, Jabardasth Show, Naughty Naresh, Punch Prasad, Tirupatiprakas

మేము ఉన్నప్పుడు జబర్దస్త్ టిఆర్పి 14 , 15 ఉండేది ఇక ఇప్పుడు 3 ఉంది.నేను జబర్దస్త్ కోసం ఎంతో కష్టపడ్డాను.మా అమ్మ సిఓపిడి ప్రాబ్లమ్ తో చనిపోయారు.

ఏడాదిలో నాలుగు సార్లు హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యేవారు.మా అమ్మ ఐసీయూలో ఉన్నప్పుడు డాక్టర్స్ ఎప్పుడు పిలుస్తారో తెలీక నేను, కెవ్వు కార్తీక్, నత్తిగా మాట్లాడే దుర్గారావు వీళ్లంతా హాస్పిటల్ దగ్గరకు వచ్చి నాతో పాటు ఉంటూ స్కిట్స్ రాసుకునేవాళ్ళు.

ఇప్పుడు అవకాశం వచ్చినా వెళ్తాను.ఎందుకంటే నేను ఆర్టిస్ట్ ని కదా అని చెప్పుకొచ్చాడు తిరుపతి ప్రకాష్.

ఈ సందర్భంగా తిరుపతి ప్రకాష్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube