వీడియో: రైల్వే ట్రాక్‌పై స్పృహ తప్పి పడిపోయిన వ్యక్తి.. చివరికి ఏమైందో చూడండి..

మంచి పనులు చేస్తే మంచి ఫలితాలు కూడా దక్కుతాయి.దయ, సానుకూలతతో వ్యవహరించే వారికి జీవితం ఎప్పుడూ బహుమతులను అందిస్తుంది.

 Chicago Philanthropist Gifts Man A Car After He Saved A Man From Train Tracks De-TeluguStop.com

ఈ మాటలను చికాగోలో( Chicago ) జరిగిన ఒక సంఘటన ప్రూవ్ చేస్తోంది.ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారి, లక్షలాది మందిని కదిలించింది.

రాకేష్ బిష్నోయి (సారణ్)( Rakesh Bishnoi ) అనే వ్యక్తి తన X అకౌంట్‌లో దీనిని పంచుకున్నాడు.ఈ వీడియోలో ఒక వ్యక్తి స్పృహ తప్పి రైల్వే ట్రాక్( Railway Track ) మీద పడిపోవడం చూడవచ్చు.

అతను చాలా ప్రమాదకర స్థితిలో ఉన్నాడు.ఆ వ్యక్తిని రక్షించడానికి మరొక వ్యక్తి తన ప్రాణాన్ని లెక్క చేయకుండా ముందుకు వచ్చాడు.

చాలా వేగంగా, సురక్షితంగా ఆ వ్యక్తిని రక్షించాడు.ఆ వ్యక్తి వేగవంతమైన ఆలోచన, ధైర్యం వల్ల ఒక పెద్ద విషాదం తప్పింది.

వైరల్ వీడియోకు( Viral Video ) ఇప్పటికే 13 లక్షలకు పైగా వ్యూస్‌ వచ్చాయి.ఇది అనేక సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలలో ట్రెండింగ్ టాపిక్‌గా మారి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలను ప్రేరేపించింది.ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, రక్షించిన ఆ వ్యక్తి ధైర్యానికి చలించిన ఒక దాత, ఆయనను గౌరవించాలని నిర్ణయించుకున్నారు.కృతజ్ఞతా భావంతో ఆ దాత ఆ రియల్ హీరోకు( Real Hero ) ఒక లగ్జరీ కారును బహుమతిగా( Luxury Car Gift ) ఇచ్చారు.

దాంతో ప్రస్తుత సమాజం ధైర్యం, దయకు ఎంతగా ప్రాముఖ్యత ఇస్తుందో తెలిసింది.

ఈ వీడియోపై చాలామంది సోషల్ మీడియా యూజర్లు కామెంట్లు చేశారు.రక్షించిన ఆ వ్యక్తి నిస్వార్థత, ధైర్యాన్ని అభినందిస్తున్నారు.చాలామంది ఆయన చేసిన పని మానవత్వానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అని అభివర్ణించారు.

ఈ కథ మంచి పనులు చేయడం ఎంత ముఖ్యమో అందరికీ గుర్తు చేస్తుంది.మంచి పనులకు ఎప్పుడూ గుర్తింపు ఉంటుందని తెలియజేస్తుంది.

ఈ వీడియోను మీరు కూడా చూసేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube