1. పెన్షన్ల పై షర్మిల కామెంట్స్

తమ పార్టీ అధికారంలోకి వస్తే ఇంట్లో ఎంతమంది ఉంటే అందరికీ పెన్షన్ ఇస్తామని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల హామీ ఇచ్చారు.
2.రేపు బంగాళాఖాతంలో అల్పపీడనం
రేపు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.
3.బండి సంజయ్ భారీ బహిరంగ సభ

తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన మూడో విడత ప్రజాసంఘన యాత్ర 16 రోజులలో భాగంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో నేడు నాలుగో రోజు కొనసాగుతోంది.నేడు జనగామలో బండి సంజయ్ భారీ బహిరంగ సభను నిర్వహించనున్నారు.
4.అమిత్ షా సభకు ఇన్చార్జిలు నియామకం
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఈనెల 21 మునుగోడు లో నిర్వహించే భారీ బహిరంగ సభను విజయవంతం చేసే విషయంలో భాగంగా మండలాల వారీగా ఇంచార్జిలను నియమించారు.
5.నేటి నుంచి కానిస్టేబుల్ ఉద్యోగాలకు హాల్ టికెట్లు

కానిస్టేబుల్ ప్రైమరీ ఉద్యోగాలకు నిర్వహించే ప్రాథమిక రాక పరీక్షకు నేటి నుంచి హాల్ టికెట్లు జారీ చేయనున్నట్లు పోలీస్ నియామక మండలి చైర్మన్ వివి శ్రీనివాసరావు తెలిపారు.
6.నేడు కాంగ్రెస్ పార్టీ కీలక సమావేశం
కాంగ్రెస్ పార్టీ తీవ్రత సమావేశానికి శబ్దం పార్టీలో అత్యంత నిర్ణయాధికార కమిటీ కాంగ్రెస్ వర్కింగ్ ఈరోజు సోనియా అధ్యక్షతన భేటీ కానుంది.
7.తెలంగాణ కాంగ్రెస్ ముఖ్య నేతలతో ఠాగూర్ బేటి

నేడు తెలంగాణ కాంగ్రెస్ ముఖ్య నేతలతో మాణిక్యం ఠాకూర్ బేటి కాబోతున్నారు.
8.తిరుమల సమాచారం
నేడు తిరుమల శ్రీవారి ప్రత్యేక దర్శనం టికెట్లను టీటీడీ విడుదల చేయనుంది.అక్టోబర్ నెల కు సంబంధించిన 300 రూపాయల దర్శన టికెట్లను విడుదల చేస్తున్నారు.
9.నేడు ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం చర్చలు

నేడు ఉద్యోగ సంఘాలతో ఏపీ ప్రభుత్వం చర్చలు జరుపనుంది.సిపిఎస్ పై ఉద్యోగులతో ప్రభుత్వం చర్చించనుంది.
10.మెగా రక్తదాన శిబిరం
మెగాస్టార్ చిరంజీవి జన్మదినం పురస్కరించుకొని రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంకులలో మెగా రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నారు.
11.నూతన రైలు ప్రారంభం

నేటి నుంచి గుంటూరు నంద్యాల తిరుపతి మీదుగా నూతన రైలు ప్రారంభం కానుంది.
12.బాస్కెట్ బాల్ పోటీలు
ఎన్టీఆర్ స్టేడియంలో నేటి నుంచి రాష్ట్రస్థాయి బాస్కెట్ బాల్ పోటీలు ప్రారంభం కానున్నాయి.
13.రామసేతు కేసును విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకారం

‘ రామ సేతు ‘ ను జాతీయ వారసత్వ స్మారక చిహ్నంగా ప్రకటించేలా కేంద్రాన్ని ఆదేశించాలని కోరుతూ బిజెపి నాయకుడు సుబ్రహ్మణ్యస్వామి దాఖలు చేసిన పిటిషన్ విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకారం తెలిపింది.
14.చీకొటి ప్రవీణ్ సంచల వ్యాఖ్యలు
ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ విచారణ ఎదుర్కొంటున్న చీకోటి ప్రవీణ్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు.తనకు విదేశాల నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయని, హిట్ మాన్ అనే విదేశీ యాప్ లో తన పేరుపై సఫారీ ఇచ్చినట్లుగా బెదిరిస్తున్నారని ప్రవీణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
15.చిన్నారులకు టికెట్స్ పై రైల్వే శాఖ ప్రకటన

రైళ్లలో ఐదేళ్ల లోపు చిన్నారులకు కూడా టికెట్ తీసుకోవాలంటూ వస్తున్న వార్తలపై రైల్వే శాఖ స్పందించింది అవన్నీ అసత్య ప్రచారాలని పేర్కొంది.
16.NMDC లో 130 ట్రేడ్ అప్రెంటిస్
భారత ప్రభుత్వ సంస్థ నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ బాచేలి కాంప్లెక్స్ అనేక ట్రేడ్ అప్రెంటిస్ ల భర్తీకి ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది .
17.జనసేన పిఎసి సమావేశం

22 న జనసేన పీఏసీ సమావేశం జరగనుంది.
18.మంగళగిరిలో టిడిపి ఎస్సీ సెల్ దీక్ష భగ్నం
మంగళగిరిలో టిడిపి ఎస్సీ సెల్ దీక్షను పోలీసులు భగ్నం చేశారు.విదేశీ విద్యా పథకానికి అంబేద్కర్ పేరు పెట్టాలని టిడిపి నేతలు డిమాండ్ చేస్తు రెండు రోజులుగా దీక్ష చేపట్టారు.
19.సాగర్ టెయిల్ పాండ్ నుంచి నీటి విడుదల

సత్రసాల లోని నాగార్జునసాగర్ టైల్ పాండ్ ప్రాజెక్ట్ 17 క్రస్ట్ గేట్ల ద్వారా పులిచింతలకు బుధవారం 3,33,939 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు.
20.ఈరోజు బంగారం ధరలు
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 47,900 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 52,250
.