ఈ హెర్బల్ ఆయిల్ ను వారానికి 2 సార్లు రాసుకుంటే జుట్టు రాలమన్నా రాలదు!

పోషకాల కొరత, ఒత్తిడి, కంటి నిండా నిద్ర లేకపోవడం, రసాయనాలు అధికంగా ఉండే షాంపూను వాడటం, వేడి వేడి నీటితో తల స్నానం చేయడం వంటి కారణాల వల్ల చాలా మంది అధిక హెయిర్ ఫాల్ సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటారు.ఈ క్రమంలోనే జుట్టు రాలడాన్ని( Hairfall ) అడ్డుకోవడం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు.

 This Herbal Oil Helps To Stop Hair Fall Quickly!, Hair Fall, Hair Care, Hair Car-TeluguStop.com

మీరు ఈ లిస్టులో ఉన్నారా.? అయితే కచ్చితంగా ఇప్పుడు చెప్పబోయే హెర్బల్ ఆయిల్ ను మీరు వాడాల్సిందే.వారానికి రెండు సార్లు ఈ ఆయిల్ ను రాసుకుంటే జుట్టు రాలమన్నా రాలదు.అంత ఎఫెక్టివ్ గా పని చేస్తుంది.

Telugu Care, Care Tips, Fall, Oil, Healthy, Herbal Oil, Latest, Long, Thick-Telu

మరి ఆ హెర్బల్ ఆయిల్( Herbal Oil ) ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఓ చూపు చూసేయండి.ముందుగా స్టవ్ ఆన్ చేసి మందపాటి గిన్నెను పెట్టుకుని అందులో రెండు గ్లాసులు కొబ్బరి నూనె వేసుకోవాలి.ఆయిల్ హీట్ అవ్వడానికి ముందే అరకప్పు అలోవెరా ముక్కలు, రెండు టేబుల్ స్పూన్లు హెన్నా పౌడర్( Henna Powder ), అరకప్పు ఉసిరికాయ ముక్కలు, హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాలు, వన్ టేబుల్ స్పూన్ మెంతులు, వన్ టేబుల్ స్పూన్ కలోంజి సీడ్స్( Kalonji Seeds ), ప‌ది తులసి ఆకులు, రెండు రెబ్బలు కరివేపాకు, నాలుగు మందారం పువ్వులు వేసి ఉడికించాలి.

Telugu Care, Care Tips, Fall, Oil, Healthy, Herbal Oil, Latest, Long, Thick-Telu

చిన్న మంటపై దాదాపు పది నుంచి ప‌దిహేను నిమిషాల పాటు హీట్ చేయాలి.ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఆయిల్ ను చల్లార బెట్టుకోవాలి.పూర్తిగా కూల్ అయిన అనంతరం స్ట్రైన‌ర్ సహాయంతో ఆయిల్ ను ఫిల్టర్ చేసుకుని ఒక బాటిల్ లో స్టోర్ చేసుకోవాలి.

ఈ ఆయిల్ హెయిర్ ఫాల్ సమస్యను నివారించడానికి చాలా ఉత్తమం గా సహాయపడుతుంది.స్కాల్ప్ తో పాటు జుట్టు మొత్తానికి ఈ ఆయిల్ ను అప్లై చేసుకుని కాసేపు మసాజ్ చేసుకోవాలి.

వారానికి రెండు సార్లు ఈ ఆయిల్ ను తలకు రాసుకుంటే హెయిర్ రూట్స్ బలోపేతం అవుతాయి.హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది.జుట్టు ఒత్తుగా పెరగడం స్టార్ట్ అవుతుంది.తెల్ల జుట్టు( White Hair ) త్వరగా రాకుండా సైతం ఉంటుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube