Hair Pack : నెలలో మూడు సార్లు ఈ హోమ్ మేడ్ ప్యాక్ ను వేసుకుంటే జుట్టు సమస్యలన్నీ పరార్!

అసలే ప్రస్తుతం వింట‌ర్ సీజ‌న్‌ కొనసాగుతుంది.ఈ సీజన్లో వాతావరణం లో వచ్చే మార్పుల కారణంగా జుట్టు రాలడం, పొడిగా మారడం, చుండ్రు తదితర సమస్యలు తీవ్రంగా సతమతం చేస్తుంటాయి.

 Try This Pack Three Times In A Month, All Hair Problems Will Go Away , Hair Prob-TeluguStop.com

వాటి నుంచి విముక్తి పొందడం కోసం ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తుంటారు.అయితే ఇప్పుడు చెప్పబోయే హోమ్ మేడ్ హెయిర్ ప్యాక్ ను నెలలో మూడు సార్లు కనుక వేసుకుంటే ఆయా జుట్టు సమస్యలన్నీ పరార్ అవ్వడం ఖాయం.

మరి ఇంకెందుకు ఆలస్యం ఆ హెయిర్ ప్యాక్ ఏంటి.? దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి.? వంటి విషయాలపై ఓ లుక్కేయండి.

ముందుగా ఒక కలబంద ఆకును తీసుకుని నీటిలో శుభ్రంగా కడిగి.

అందులో ఉండే జెల్ ను సపరేట్ చేసుకోవాలి.అలాగే ఒక మీడియం సైజు బీట్ రూట్ ను తీసుకుని పీల్ తొలగించి ముక్కలుగా కట్ చేసుకోవాలి.

మరోవైపు ఒక బౌల్ తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ మెంతులు వేసి వాటర్ పోసి కనీసం ఐదు గంటల పాటు నానబెట్టుకోవాలి.

ఇప్పుడు బ్లెండ‌ర్‌ తీసుకుని అందులో నానబెట్టుకున్న మెంతులు, క‌ట్ చేసి పెట్టుకున్న బీట్ రూట్ ముక్కలు, అలోవెరా జెల్, గుప్పెడు గోరింటాకు ఆకులు, మూడు లేదా నాలుగు మందార ఆకులు, నాలుగు టేబుల్ స్పూన్లు పెరుగు, ఒక కప్పు వాటర్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల‌ నుంచి చివర్ల వరకు అప్లై చేసుకుని షవర్ క్యాప్ ధరించాలి.

Telugu Dandruff, Care, Care Tips, Fall, Pack, Problems, Latest, Long-Latest News

గంటన్నర అనంతరం మైల్డ్ షాంపూ యూస్ చేసి గోరువెచ్చని నీటితో శుభ్రంగా తల స్నానం చేయాలి.నెలలో మూడు సార్లు కనుక ఈ హెయిర్ ప్యాక్ ను వేసుకుంటే జుట్టు రాలడం తగ్గుతుంది.చుండ్రు సమస్య పోతుంది.

డ్రై హెయిర్ నుంచి విముక్తి లభిస్తుంది.జుట్టు కుదుళ్లు బలంగా మారి.

ఒత్తుగా, పొడుగ్గా పెరుగుతుంది.మరియు ఈ ప్యాక్ ను వేసుకోవడం వల్ల తెల్ల జుట్టు త్వరగా రాకుండా కూడా ఉంటుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube