బాగా పులియబెట్టిన ఆహారం తీసుకోవడం ద్వారా శరీరానికి ఎలాంటి లాభాలు అంటే..?!

చాలామంది ఉదయం పూట ఆహారంగా ఎక్కువగా ఇడ్లీ, దోసలను తింటూ ఉంటారు.అయితే అప్పట్లో ఇడ్లీ, దోశ పిండిని రుబ్బి రాత్రంతా పులియపెట్టి మరుసటి రోజు ఉదయాన్నే టిఫిన్ కింద వేసేవారు.

 What Are The Benefits To The Body By Consuming Well Fermented Food Food, Helat-TeluguStop.com

కానీ ఇప్పుడంటే ఫ్రిడ్జ్ అందుబాటులోకి రావడంతో ఎవరు కూడా పిండి పులిసిపోతే ఇడ్లిలు, దోశలు పుల్లగా ఉంటాయని రుబ్బిన వెంటనే ఫ్రిడ్జ్ లో పెట్టేస్తున్నారు.కానీ అలా చేయడం మంచి పద్ధతి కాదు.

పులియబెట్టిన ఆహారాన్ని తినడం వలన ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందన్న విషయం మీలో చాలా మందికి తెలియదు.ఎందుకంటే ఇవి పొట్ట ఆరోగ్యానికి ఎంతో మేలుచేస్తాయి.

ఇలా పులియపెట్టిన ఆహారం గట్‌ లో ఆరోగ్యకరమైన బ్యాక్టీరియాను ఉత్పత్తి చేస్తుంది.మరి ఆలస్యం చేయకుండా పులియబెట్టిన ఆహారం వల్ల ఎన్ని లాభాలు కలుగుతాయో తెలుసుకుందాం.

వాస్తవానికి పులియబెట్టిన ఆహారాలలో మంచి బ్యాక్టీరియా పెరుగుతుంది.వీటినే మనం ప్రోబయోటిక్స్ అని అంటారు.పులియపెట్టిన ఆహారం తినడం వలన పొట్ట ఆరోగ్యంగా ఉంటుంది.ఎందుకంటే పులియబెట్టిన ఆహారంలో ఉండే మంచి బ్యాక్టీరియా మన జీర్ణ ప్రక్రియను వేగవంతం చేస్తుంది.

ఫలితంగా మలబద్ధకం, గ్యాస్, అసిడిటీ వంటి అన్ని సమస్యలు కూడా దూరం అవుతాయి.పులియబెట్టిన ఆహారంలో లాక్టిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటుంది.

ఇది పేగుల్లో ఉండే మురికి, చెడు బ్యాక్టీరియాను తొలగిస్తుంది.అలాగే మన శరీరంలో రోగనిరోధక శక్తిని పెరగాలంటే మంచి బ్యాక్టీరియా అవసరం అవుతుంది.

Telugu Benefits, Effects, Ups, Helath Care, Helath Tips, Immunity-Telugu Health

అందుకే పులియబెట్టిన ఆహారం తీసుకుంటే ఇమ్మ్యూనిటి శక్తి అనేది పెరుగుతుంది.అంతేకాకుండా పులియబెట్టిన ఆహార పదార్ధాలు తినడం వలన అవి త్వరగా జీర్ణమవడంతో పాటు బరువు కూడా తగ్గవచ్చు.శరీరంలో యాంటీ ఆక్సిడెంట్స్ కూడా పుష్కలంగా పెరుగుతాయి.చూసారు కదా పులియపెట్టిన ఆహారం వలన ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో.అలాగే ఈ ప్రక్రియను కిణ్వ ప్రక్రియ అంటారు.మనం ప్రతినిత్యం తినే దోశ, ఊతప్పం, ఇడ్లీ, మొదలైనవి ఇలా పులియపెడతారు.

అలాగే ఈ కోవలోకి రొట్టె, పెరుగు, పెరుగు వడ, ఊరగాయ కూడా వస్తాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube