ఈ మధ్య సౌత్ లో ఉన్న హీరోయిన్ లు హిట్ లు లేక సతమతమవుతున్నారు.మంచి క్రేజే ఉన్న హీరోయిన్ లుగా చెప్పుకుంటున్న వారికందరికి ప్లాప్ సినిమాలు వస్తున్నాయి.
అయితే తమకు ప్లాప్ సినిమాలు వస్తున్న అవేమీ పట్టించుకోకుండా వరుస ప్రాజెక్ట్ లను లైన్ లో పెడుతున్నారు.దీనితో సౌత్ లో ఉన్న హీరోయిన్ ల కెరీర్ ప్రమాదంలో పడిందా అంటూ ఇటీవల ఇండస్ట్రీ వర్గాలు గుసగుసలాడుకున్నాయి.
అందుకే నిర్మాతలు సైతం నార్త్ హీరోయిన్ ల మీద దృష్టి సారిస్తున్నారు.ఇదిలా ఉంటే మన సౌత్ హీరోయిన్ లకు దెబ్బేసిన సినిమాలు ఏవో ఒకసారి చూద్దాం.
ఈ మధ్యనే తమిళ్ నుండి విడుదలయిన కాదు వాక్కుల రెండు కాదల్ అనే సినిమాతో నయనతార మరియు సమంత లు విజయ్ సేతుపతి హీరోగా వచ్చిన సంగతి తెలిసిందే.ఈ సినిమాకు నయన్ బాయ్ ఫ్రెండ్ విగ్నేష్ శివం డైరెక్టర్.
అయితే ఈ సినిమా అందరినీ ఎంతో నిరాశపరిచింది అని చెప్పాలి.దీనితో నయన్ మరియు సమంతల షాక్ తగిలినట్లైయింది.
అయినప్పటికీ ఏ మాత్రం పట్టించుకోకుండా ఇద్దరూ వరుస సినిమాలను లైన్ లో పెట్టారు.ప్రస్తుతం నయన్ చేతిలో గాడ్ ఫాదర్, షారుఖ్ ఖాన్ తో లయన్, మరో రెండు లేడీ ఓరియెంటెడ్ మూవీస్, ఇది కాకుండా ఇంకో సినిమా విగ్నేష్ శివం డైరెక్షన్ లో చేయబోతున్నట్లు తెలుస్తోంది.
ఇక సమంత కూడా తన మూవీ ఫెయిల్ అయినా తన తప్పు కాదని, వెంటనే మరో ప్రాజెక్టులను చేసుకుంటూ పోతోంది… కాగా సమంత ఇప్పుడు శాకుంతలం మరియు యశోద లాంటి పాన్ ఇండియా సినిమాలు, అరెంజ్ మెంట్స్ ఆఫ్ లవ్ మరియు యంగ్ హీరో వరుణ్ ధావన్ తో బాలీవుడ్ లో ఒక మూవీ కంఫర్మ్ అయింది.ఇక రౌడీ హీరో విజయ్ తోనూ ఒక మూవీ చేయనుంది.
ఇక ఈ మధ్యనే వరుస హిట్ లతో దూసుకువెళుతున్న కన్నడ హీరోయిన్ రష్మిక మందన్న. ఇప్పుడు ఈమెకు ఉన్న క్రేజ్ మాటల్లో చెప్పలేము.కానీ హిట్ లు వస్తున్న సమయంలో ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమా చేసి చేతులు కాల్చుకుంది రష్మిక.అయినా కూడా తనకు నష్టం లేకపోగా అవకాశాలు వస్తూనే ఉన్నాయి.
ఇప్పుడు పుష్ప ౨ లో తానే చేస్తోంది.ఇప్పుడు ఈమె చేతిలో విజయ్ తో ఒక సినిమా, రణ్ బీర్ కపూర్ మరియు సందీప్ రెడ్డి వంగ కాంబోలో ఒకటి.
ఇవికాకుండా షూటింగ్ ను పూర్తి చేసుకుని రిలీజ్ సిద్ధంగా ఉన్న మిషన్ మజ్ను, గుడ్ బై, సీతారామం లు ఉన్నాయి.పైన మనము చెప్పుకున్న హీరోయిన్ లు అంత ఒక్క ప్లాప్ లు ఎదుర్కొన్న వారే.
కానీ ఇక్కడ పూజ హెగ్డే మాత్రం అలవైకుంఠపురంలో హిట్ తర్వాత మరో సినిమా హిట్ కాకపోవడం చాలా నిరాశను కలిగిస్తోంది.వరుసగా రాధేశ్యామ్, బీస్ట్, ఆచార్య సినిమాలు డిజాస్టర్ లుగా మిగిలిపోయాయి.
అయినా తాను ఎక్కడా తగ్గడం లేదు , సినిమా చేయడమే నా పని హిట్ లేదా ప్లాప్ అనేది నా చేతిలో లేదు అన్నట్లుగా వెడలు వల్లిస్తోంది ఈ బుట్టబొమ్మ.ఇప్పుడు త్రివిక్రమ్ తో ఒకటి, హరీష్ శంకర్ తో ప్రాజెక్టు లను ఓకే చేసింది.
ఇక ఇవి కాకుండా బాలీవుడ్ లో మరో రెండు సినిమాలు నిర్మాణ దశలో ఉన్నాయి.
ఇక మహానటి లాంటి అద్బుతమయిన సినిమా తర్వాత కీర్తి సురేష్ కు హిట్ లేదు.పూజ హెగ్డే లాగానే వరుసగా ప్లాప్ ల;అను ఎదుర్కొంటూ, బాధలను దిగమింగుకుంటూ సినిమాలను చేస్తూ పోతోంది.థియేటర్ లోనే కాకుండా ఓ టి టి లోనూ తనకు విజయం దక్కలేదు.
ఇప్పుడు తాను చిరు తో చెల్లెలుగా భోళా శంకర్, నాని దసరా సినిమాలలో చేస్తోంది.ఇక ఇప్పటికే ప్రైమ్ లో రిలీజ్ అయిన చిన్ని ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.
ఇక గ్రాండ్ మూవీ అంటే.మహేష్ తో చేసిన సర్కారు వారి పాట మే 12 న రిలీజ్ అయింది.
ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.ఇక వీరు కాకుండా, కృతి శెట్టి, శ్రీలీల, సంయుక్త మీనన్ వాళ్ళు ఆఫర్ లను దక్కించుకుని చేసుకుంటూ పోతున్నారు.
ఇక వీరు కాకుండా కొత్త హీరోయిన్ లు కూడా టాలీవుడ్ ను ఆక్రమించుకోవడానికి వస్తున్నారు.సీనియర్ టాప్ హీరోయిన్ లు కనుక నెమ్మదిగా ఆచితూచి అడుగులు వేయకపోతే వీరికి కాలం కుదిరే పని కాదు అని తెలుస్తోంది.