ఆ విధంగా రికార్డ్ సృష్టించబోతున్న టీడీపీ 

ప్రస్తుతం ఏపీలో తెలుగుదేశం పార్టీ( TDP ) దూకుడు కనిపిస్తోంది.పార్టీ అధికారంలో ఉండడంతో ఆ పార్టీలోకి చేరికలు ఊపందుకున్నాయి.

 Tdp Party Creating Record In Party Membership Registrations Details, Tdp, Tdp Me-TeluguStop.com

ఇక సభ్యత నమోదు విషయంలోనూ రికార్డులు దిశగా దూసుకుపోతోంది.ఈ  ఏడాది అక్టోబర్ 26వ తేదీ నుంచి టిడిపి సభ్యత్వ నమోదు( Tdp Membership ) కార్యక్రమాన్ని టిడిపి అధినేత,  ఏపీ సీఎం చంద్రబాబు( CM Chandrababu ) ప్రారంభించారు ఇప్పటి వరకు దాదాపు 94 లక్షల మంది వరకు పార్టీ సభ్యత్వాన్ని స్వీకరించారు.

  గత 63 రోజులుగా ప్రతిరోజు సాగుతున్న ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది.   లక్షన్నర మంది వరకు టిడిపి సభ్యత్వం తీసుకున్నారు.

Telugu Cm Chandrababu, Insurance, Chandrababu, Lokesh, Tdp, Tdp Membership, Tdpm

నిన్నటితో ఈ సభ్యత్వం నమోదు కార్యక్రమం ముగిసింది .అయితే కార్యకర్తలు , ప్రజల నుంచి ఈ గడువు  పెంచాలి అనే ఒత్తిడి పెరుగుతోంది .సంక్రాంతి పండుగ వరకు ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పొడిగించాల్సిందిగా టిడిపి అధినేత చంద్రబాబుకు,  టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు( Nara Lokesh ) పెద్ద ఎత్తున వినతులు అందుతున్నాయి .పార్టీ క్యాడర్ తో పాటు ,ప్రజల నుంచి వస్తున్న ఈ స్పందనతో మరో 15 రోజులు పాటు సభ్యత్వ నమోదు గడువును పెంచాలని తాజాగా నిర్ణయించుకున్నారు.గత ఏడాది ప్రారంభించిన ఈ సభ్యత్వం నమోదు కార్యక్రమం పూర్తిగా డిజిటల్ విధానంలో చేపట్టారు.

Telugu Cm Chandrababu, Insurance, Chandrababu, Lokesh, Tdp, Tdp Membership, Tdpm

నారా లోకేష్ నేతృత్వంలో దేశంలో ఎక్కడా లేనివిధంగా గత ఐదేళ్లలో కార్యకర్తల సంక్షేమం కోసం 138 కోట్లు ఖర్చు చేశారు .పార్టీ సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్కరికి ఐదు లక్షల ప్రమాద బీమా సౌకర్యాన్ని కల్పిస్తున్నారు.  సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఒక పండుగలా నిర్వహిస్తూ, సరికొత్త రికార్డు సాధించే దిశగా ముందుకు వెళుతున్నారు.

  కోటి సభ్యత్వాలు నమోదు లక్ష్యంగా పెట్టుకున్నారు.టిడిపి సభ్యత్వ నమోదులో నెల్లూరు సిటీ మొదటి స్థానంలో నిలిచింది.

టిడిపి సభ్యత్వ నమోదులో మొదటి పది నియోజకవర్గాల వారీగా చూసుకుంటే…

1) నెల్లూరు సిటీ -1,46,966

2) పాలకొల్లు – 1,44,992

3) ఆత్మకూరు -1,34,584

4) రాజంపేట – 1,29,783

5) కుప్పం – 1,28,496

6) ఉండి – 1,14,443

7) గురజాల – 1,08,839

8) వినుకొండ – 1,05,158

9) మంగళగిరి – 1,04,122

10) కళ్యాణదుర్గం – 1,00,325

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube