పుష్ప 2( Pushpa 2 ) సినిమా విడుదల సమయంలో సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో భాగంగా చోటు చేసుకున్న ఘటన తర్వాత అల్లు అర్జున్( Allu Arjun ) పూర్తిస్థాయిలో విమర్శలను ఎదుర్కొంటూ ఉన్నారు.ముఖ్యంగా అల్లు అర్జున్ యాంటీ ఫ్యాన్స్ సైతం ఈయనపై విమర్శలు చేస్తూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు చేస్తున్న సంగతి తెలిసిందే.
ఇలా అల్లు అర్జున్ గురించి విమర్శలు వస్తున్న తరుణంలో సినీ నటి మాధవీ లత( Madhavi Latha ) సోషల్ మీడియా వేదికగా ఒక వీడియోని షేర్ చేస్తూ పూర్తిస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ వీడియోలో ఈమె మాట్లాడుతూ సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు.అల్లు అర్జున్ కు యాటిట్యూడ్.పొగరు.
పైకి కిందికి చూస్తూ ఉంటాడు.ఆ కళ్ళల్లో ఆటిట్యూడ్ కారిపోతుంది.
ఎంత బలుపు అంటూ ఒకటే విమర్శలు చేస్తూ పోస్టులు చేస్తున్నారు.అరే అల్లు అర్జున్ పుట్టడమే గోల్డెన్ స్కూల్ కాదు కదా డైమండ్ స్పూన్ తో పుట్టారు.
ఆ మాత్రం ఆటిట్యూడ్ ఉండడం పరవాలేదు.ఏమీ లేని వేపాకు కరివేపాకు గాలు మీకే ఆటిట్యూడ్ ఉంటే ఆయనకు ఉండటం తప్పులేదు.
నువ్వంత యాటిట్యూడ్ చూపించడానికి ఎదుటివాళ్ళని జడ్జ్ చేయడానికి నీకేం హక్కు ఉంది.
10 ఏళ్ల క్రితం అనుకుంట రామ్ చరణ్‌ది( Ram Charan ) ఓ ఇంటర్వ్యూ చూశా.మీకెందుకు ఇంత యాటిట్యూడ్ అని అడిగితే ఎందుకు ఉండకూడదు అన్నారు.అవును ఆయన చిరంజీవి కొడుకు ఆటిట్యూడ్ ఉంటే తప్పులేదు.
మరి అల్లు అరవింద్ కొడుకుకు ఆటిట్యూడ్ ఉంటే తప్ప అంటూ ప్రశ్నించారు.ఏ మీరు చూపిస్తే యాటిట్యూడ్ కానిది అల్లు అర్జున్ చేస్తే ఎలా అవుతుంది.
ప్రతిదీ స్లో మోషన్‌లో పెట్టి మరీ ట్రోల్స్ చేస్తున్నారు.దించుతాం మేము బలుపు దించుతాం అంటూ పోస్టులు పెడుతున్నారు.
ఏందిరా మీరు దించేది మీ చేత ఏం కాదు అంటూ ఈమె పూర్తిస్థాయిలో అల్లు అర్జున్ కి సపోర్ట్ చేస్తూ తనపై విమర్శిస్తున్న వారికి తనదైన శైలిలోనే కౌంటర్ ఇచ్చారు.