అన్ స్టాపబుల్ షోలో చరణ్ వేసుకున్న టీ షర్ట్ ధర ఎంతో తెలుసా... దిమ్మతిరిగి పోవాల్సిందే!

పాన్ ఇండియా స్టార్ హీరో రామ్ చరణ్( Ram Charan ) త్వరలోనే గేమ్ ఛేంజర్( Game Changer ) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.ఈ సినిమా సంక్రాంతి పండుగను పురస్కరించుకొని జనవరి 10వ తేదీ విడుదల కాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్లను వేగవంతం చేశారు.

 Do You Know Ram Charan Wore Tshirt Cost At Unstoppable Show Details, Ram Charan,-TeluguStop.com

ఈ క్రమంలోనే మొదటిసారి రామ్ చరణ్ బాలకృష్ణ( Balakrishna ) హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్( Unstoppable ) కార్యక్రమానికి హాజరయ్యారు.ఇక ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమోలు అలాగే ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Telugu Balakrishna, Game Changer, Ram Charan, Ram Charan Cost, Ramcharan, Un Sto

ఇక ఈ కార్యక్రమంలో భాగంగా రాంచరణ్ ధరించిన టీషర్ట్( Ram Charan T-Shirt ) అందరి దృష్టిని ఆకర్షించింది.ఈ కార్యక్రమానికి రామ్ చరణ్ బోన్స్ హూడీ ధరించారు.దీంతో రామ్ చరణ్ ధరించిన ఈ టీ షర్ట్ ధర ఎంత ఉంటుంది అంటూ ఆరా తీయడం మొదలుపెట్టారు.అమిరి కంపెనీకి చెందిన లాంగ్‌స్లీవ్స్ కలిగిన టీషర్ట్ ఇది.దీని ధర అక్షరాల రూ.1,35,722 అని తెలుస్తోంది.ఇలా రామ్ చరణ్ లక్షలు విలువచేసే టీషర్ట్ ధరించారని విషయం తెలిసి అభిమానులు షాక్ అవుతున్నారు.అయితే సెలబ్రిటీలకు ఇలాంటి ఖరీదైన బ్రాండెడ్ దుస్తులు ధరించడం బ్రాండెడ్ వస్తువులను ఉపయోగించడం సర్వసాధారణం.

Telugu Balakrishna, Game Changer, Ram Charan, Ram Charan Cost, Ramcharan, Un Sto

ఇక గేమ్ ఛేంజర్ సినిమా విషయానికి వస్తే శంకర్ డైరెక్షన్ లో తెరకేక్కిన ఈ సినిమా ఇప్పటికీ విడుదల కావాల్సి ఉండగా షూటింగ్ ఆలస్యం కావడంతో వాయిదా పడుతూ జనవరి 10వ తేదీ పాన్ ఇండియా స్థాయిలో విడుదలకు సిద్ధమవుతోంది.ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ ద్విపాత్రాభినయం  నటించారు.అంజలి కియారా అద్వానీ హీరోయిన్లుగా నటిస్తున్నారు.రామ్ చరణ్ నటించిన RRR సినిమా తర్వాత ఈ చిత్రం విడుదల కాబోతున్న నేపథ్యంలో ఈ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube