మన శరీరంలో క్లోమ గ్రంథి ఉత్పత్తి చేసే ఇన్సులిన్ ని మన శరీరం సరిగా ఉపయోగించుకోకపోతే రక్తంలో చక్కర స్థాయిలు పెరిగి టైప్ 2 డయాబెటిస్ వస్తుంది.అయితే ఇలా జరగటానికి చాలా కారణాలు ఉంటాయి.
అవసరానికి మించి ఆహారం తీసుకోవటం,సరైన నిద్ర లేకపోవటం,వ్యాయామం చేయకపోవటం వంటి కారణాలతో టైప్ 2 డయాబెటిస్ వస్తుంది.అయితే టైప్ 2 డయాబెటిస్ ని కంట్రోల్ లో ఉంచుకోవటానికి ప్రతి రోజు వ్యాయామం చేస్తూ ఆహార నియమాలను పాటిస్తూ కొన్ని చిట్లకను ఫాలో అయితే సరిపోతుంది.
ఇప్పుడు ఆ చిట్కాల గురించి వివరంగా తెలుసుకుందాం.పాల ఉత్పత్తులు,ఎక్కువగా పిండి పదార్ధాలు ఉండే ఆహారాలు,స్వీట్స్ తినటం తగ్గించాలి.
వీటికి బదులుగా తాజా కూరగాయలు,పండ్లు తీసుకుంటే మంచిది.వీటిని సలాడ్ రూపంలో తీసుకోవచ్చు.
ప్రతి రోజు చేసుకొనే కూరల్లో పసుపు వాడటాన్ని అలవాటుగా చేసుకోవాలి.ఎందుకంటే పసుపులో ఉన్న లక్షణాలు డయాబెటిస్ ని నియంత్రిస్తాయి.
అర టీస్పూన్ బిర్యానీ ఆకు చూర్ణం, అర టీస్పూన్ పసుపు, ఒక టేబుల్ స్పూన్ అలోవెరా జెల్‌లను తీసుకోని బాగా కలపాలి.ఈ మిశ్రమాన్ని ఉదయం,సాయంత్రం తీసుకుంటే డయాబెటిస్ అదుపులో ఉంటుంది.
రాత్రి సమయంలో రాగి పాత్రలో నీటిని పోసి మరుసటి రోజు ఉదయం పరగడుపున ఆ నీటిని త్రాగాలి.ఈ విధంగా ప్రతి రోజు చేస్తూ ఉంటే డయాబెటిస్ అదుపులో ఉంటుంది.
అరకప్పు నీటిలో ఒక స్పూన్ మెంతులను రాత్రి సమయంలో నానబెట్టాలి.మరుసటి రోజు నానిన మెంతులను నీటితో సహా తీసుకోవాలి.
అయితే పరగడుపున మాత్రమే తీసుకోవాలి.