ప్రస్తుతం వర్షాకాలం కొనసాగుతోంది.చాలా ప్రాంతాల్లో జోరుగా వర్షాలు కురుస్తున్నాయి.
ఈ సీజన్‌లో మలేరియా, చికున్ గున్యా, డెంగ్యూ, ఫ్లూ, న్యుమోనియా, జలుబు, దగ్గు ఇలా రకరకాల అనారోగ్య సమస్యలు సతమతం చేస్తూనే ఉంటాయి.అందుకే వర్షాకాలంలో ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని నిపుణులు హెచ్చరిస్తుంటారు.
ఈ సీజన్‌లో సమతుల్య ఆహారం, వేడివేడి ఆహారం తీసుకోమని, ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్న పానీయాలను డైట్‌లో చేర్చుకోమని చెబుతుంటారు.
అలాగే వర్షాకాలంలో రోజుకొక గ్లాస్ పాలను తప్పకుండా తీసుకోవాలి.
అందులోనూ ముఖ్యంగా నైట్ నిద్రించే ముందు ఇప్పుడు చెప్పబోయే విధంగా పాలను తీసుకుంటే మరెన్నో హెల్త్ బెనిఫిట్స్‌ను తమ సొంతం చేసుకోవచ్చు.మరి లేటెందుకు వర్షాకాలంలో నైట్ పాలను ఎలా తీసుకోవాలో తెలుసుకుందాం పదండీ.
ముందుగా అర అంగుళం అల్లం ముక్కను తీసుకుని తొక్క తొలగించి నీటిలో శుభ్రంగా కడగాలి.ఇలా కడిగిన అల్లం ముక్కను మెత్తగా దంచి.
జ్యూస్‌ను సపరేట్ చేసుకోవాలి.ఇప్పుడు ఒక గ్లాస్ గోరు వెచ్చని పాలను తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్ల అల్లం రసం, వన్ టేబుల్ స్పూన్ బెల్లం పొడి వేసి బాగా కలిపి.
రాత్రి పడుకోవడానికి అర గంట ముందు సేవించాలి.

వర్షాకాలంలో నైట్ ఈ విధంగా పాలను తీసుకుంటే రోగ నిరోధక వ్యవస్థ బలంగా మారుతుంది.సీజనల్ వ్యాధులు దరి దాపుల్లోకి రాకుండా ఉంటాయి.ఒకవేళ జలుబు, దగ్గు, ఫ్లూ, గొంతు నొప్పి వంటి సమస్యలు ఉన్నా పరార్ అవుతాయి.
అలాగే పాలల్లో అల్లం రసం, బెల్లం పొడి కలుపుకుని తీసుకుంటే రాత్రుళ్లు నిద్ర బాగా పడుతుంది.జీర్ణ వ్యవస్థ చురుగ్గా మారుతుంది.గ్యాస్, ఎసిడిటీ, మలబద్ధకం వంటి సమస్యలు తరచూ ఇబ్బంది పెట్టకుండా ఉంటాయి.డిప్రెషన్, ఒత్తిడి వంటి మానసిక సమస్యల నుంచి సైతం ఉపశమనం లభిస్తుంది.