ఒక్కోసారి మనకు సొంత ప్రాంతంలో కంటే ఇతర ప్రాంతాల్లోనే ఎక్కువ గుర్తింపు లభిస్తుంది.సేమ్ ఇలాగే తెలుగు నేలపై పుట్టినా.
ఇక్కడ సరైన అవకాశాలు రాక.ఇతర భాషల్లో స్టార్ హీరోలుగా ఎదిగారు పలువురు తెలుగు నటులు.
తమిళ, కర్నాటక, కేరళ సహా హిందీ పరిశ్రమలోనూ మంచి అకాశాలతో సక్సెస్ ఫుల్ కెరీర్ పొందార.ఇంతకీ ఆ నటులు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం!
విశాల్

ఈయన ప్రముఖ ప్రొడ్యుసర్ జి కె కృష్ణ కుమారుడు.తమిళంలో స్టార్ హీరోగా గుర్తింపు పొందాడు.అక్కడి సినిమా అసోసియేషన్ అధ్యక్షుడిగా కూడా ఆయన పనిచేశారు.మంచి చిత్రాలతో తమిళ ప్రేక్షకుల మనసు దోచాడు విశాల్.
సమీరారెడ్డి

బాలీవుడ్‌లో ఎన్నో సినిమాలు చేసిన ఈ ముద్దుగుమ్మ తెలుగు అమ్మాయి.రాజమండ్రిలో పుట్టింది. తెలుగులో సరైన అవకాశాలు రాకపోవడంతో హిందీ సినిమాలపై దృష్టి పెట్టి అక్కడ సక్సెస్ అయ్యింది.
ఆది పినిశెట్టి

దర్శకుడు రవిరాజా పినిశెట్టి కొడుకు ఆది పినిశెట్టి.తెలుగులో కంటే ఆయనకు తమిళంలో మంచి ఫాలోయింగ్ ఉంది.ఇప్పుడిప్పుడే ఆయన తెలుగు సినిమా నుంచి మంచి అవకాశాలు వస్తున్నాయి.
సాయికుమార్

తెలుగవాడైన సాయి కుమార్ కన్నడలో స్టార్ హీరోగా ఎదిగాడు.తెలుగుతో పోల్చితే కన్నడ చిత్రాల్లోనే ఆయన ఎక్కువగా నటించారు.పోలీస్ స్టోరీ సైతం ముందుగా కన్నడంలో తెరకెక్కింది.ఆ తర్వాతే తెలుగులోకి డబ్ అయ్యింది.
ఆనంది

ఈ అమ్మాయి వరంగల్‌లో పుట్టింది. బస్టాప్, ఈరోజుల్లో సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యింది.తర్వాత ఇక్కడ అవకాశాలు రాకపోవడంతో తమిళంలోకి వెళ్లి మంచి నటిగా గుర్తింపు పొందింది.
జానీ లివర్

ఈ బాలీవుడ్ స్టార్ కమెడియన్ తెలుగు వ్యక్తి.ప్రకాశం జిల్లాకు చెందిన వాడు.ఆయన చిన్నతనంలోనే కుటుంబం ముంబైకి వలస వెళ్లింది.అక్కడే చిన్ని చిన్న స్టేజ్ షోలు చేసిన జానీ.తర్వాత సినిమాల్లో రాణించాడు.మంచి కమెడియన్‌గా గుర్తిపు పొందాడు.
జీవా

తమిళ స్టార్ హీరోల్లో జీవా ఒకడు.ఈయన తెలుగు వాడు.ప్రొడ్యూసర్ ఆర్ బి చౌదరి కొడుకు.తెలుగులో మంచి అవకాశాలు రాకపోవడంతో తమిళం వైపు వెళ్లాడు.మంచి హీరోగా ఎదిగాడు.
దియా మీర్జా

ఈమె హైదరాబాద్ అమ్మాయి.తొలుత మోడలింగ్‌లో చేసిన ఆమె.తర్వాత మిస్ ఆసియా ఫసిఫిక్ టైటిల్ గెలిచింది.ఆ తర్వాత బాలీవుడ్‌లో నటిగా రాణించింది.తెలుగలో నటించాలని ఉన్న మంచి అవకాశం రాలేదంటుంది దియా.
శ్రీరామ్

తమిళ ప్రేక్షకుల హృదయాలన దోచిన హీరో శ్రీరామ్. ఒకరికి ఒకరు సినిమాతో తెలుగువారికి పరిచయం అయిన ఈ నటుడు కూడా తెలుగువాడే.ఈయనకు తమిళ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు ఉంది.
జయం రవి

మోస్ట్ పాపులర్ తెలుగు సినిమా ఎడిటర్ మోహన్ కొడుకే ఈ జయం రవి. బావ బావమరిది సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన ఈ కుర్రాడు.హీరోగా మాత్రం తమిళంలోనే ఎక్కువ సినిమాలు చేశాడు.
వైభవ్

దర్శకుడు కోదండరామిరెడ్డి కొడుకు వైభవ్.తెలుగు సినిమాతో ఎంట్రీ ఇచ్చినా సరైన గుర్తింపు రాలేదు.తమిళ బాట పట్టి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.