నితిన్ హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా వెంకీ అట్లూరి దర్శకత్వంలో వచ్చిన రంగ్ దే సినిమా మంచి టాక్ ను దక్కించుకుంది.సినిమా ను ఒక సారి ఎంటర్ టైన్ మెంట్ కోసం చూడవచ్చు అంటూ రివ్యూలు వచ్చాయి.
రంగ్ దే కు వచ్చిన టాక్ మరియు రివ్యూలతో 20 కోట్ల రూపాయల బ్రేక్ ఈవెన్ ను ఈజీగా క్రాస్ చేస్తుందనే నమ్మకంను ఇండస్ట్రీ వర్గాల వారు వ్యక్తం చేశారు.ఓపెనింగ్ కాస్త డల్ గా ఉన్నా వీకెండ్స్ లో ఖచ్చితంగా పుంజుకుంటుందని అనుకున్నారు.కాని మొదటి వారం రోజులు ముగిసేప్పటికి ఈ సినిమ కేవలం రూ.12.5 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది.ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధ్యం అవ్వాలంటే మరో 8 కోట్ల వరకు వసూళ్లను రాబట్టాల్సి ఉంటుంది.ఈ సినిమా ఇప్పటి వరకు రాబట్టిన వసూళ్లను బట్టి చూస్తుంటే లాంగ్ రన్ లో మరో 50 లక్షల వరకు రాబట్టే అవకాశం ఉందని, దాంతో సినిమాకు 7.5 కోట్ల రూపాయల నష్టం తప్పదని అంటున్నారు.
సినిమాపై వచ్చిన క్రేజ్ నేపథ్యంలో అన్ని ఏరియాల్లో మరియు డిజిటల్ ఇంకా శాటిలైట్ రైట్స్ మంచి రేటుకే అమ్ముడు పోయాయి.కనుక నిర్మాతలకు భారీ లాభాలు లేకున్నా నష్టం మాత్రం లేదంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి.
కాని సినిమాను కొనుగోలు చేసి డిస్ట్రిబ్యూట్ చేసిన బయ్యర్లు మాత్రం బలి అయ్యారంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి.రంగ్ దే సినిమా కు పాజిటివ్ టాక్ వచ్చినా నమోదు అవుతున్న కలెక్షన్స్ చూసి ఇండస్ట్రీలో ఆందోళన వ్యక్తం అవుతోంది.
కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఈ పరిస్థితి వచ్చి ఉంటుందని కూడా కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.కరోనా భయంతో సినిమా సూపర్ హిట్ అనుకుంటేనే వెళ్లాలని ప్రేక్షకులు భావిస్తున్నారు.
అందుకే రంగ్ దే సినిమాకు పెద్దగా వసూళ్లు నమోదు అవ్వడం లేదేమో అంటూ నెట్టింట కామెంట్స్ వినిపిస్తున్నాయి.