Hair fall hair care tips : వారంలో ఒక్కసారి ఈ ప్యాక్ ను వేసుకుంటే హెయిర్ ఫాల్ అన్న మాటే అనరు!

వాతావరణంలో వచ్చే మార్పులు, పోషకాల కొరత, జుట్టు సంరక్షణ లేకపోవడం, రసాయనాలు అధికంగా ఉండే షాంపూలను వినియోగించడం, ఒత్తిడి, కంటి నిండా నిద్ర లేకపోవడం, రెగ్యులర్ గా షాంపూ చేసుకోవడం తదితర కారణాల వల్ల హెయిర్ ఫాల్ సమస్య వేధిస్తూ ఉంటుంది.ఈ సమస్యను అడ్డుకునేందుకు చాలా మంది చాలా ప్రయోగాలు చేస్తుంటారు.

 Applying This Pack Once A Week Will Reduce Hair Fall! Hair Fall, Hair Pack, Hair-TeluguStop.com

కొందరైతే హెయిర్ ఫాల్‌ను కంట్రోల్ చేసుకోవడానికి మందులు కూడా వాడుతుంటారు.కానీ ఇప్పుడు చెప్పబోయే ప్యాక్ ను వారంలో ఒక్కసారి వేసుకుంటే హెయిర్ ఫాల్ అన్న మాటే అనరు.

అవును ఈ ప్యాక్ కుదుళ్లను బలోపేతం చేసి హెయిర్ ఫాల్ కు అడ్డుకట్ట వేస్తుంది.మరి ఇంకెందుకు లేటు ఆ హెయిర్ ప్యాక్ ఏంటో తెలుసుకుందాం పదండి.

ముందుగా ఒక పెద్ద క్యారెట్‌ను తీసుకుని పీల్ తొలగించి సన్నగా తురుముకోవాలి.ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని ఒక కప్పు వాటర్ పోసుకోవాలి.

వాటర్ కాస్త హీట్ అవ్వగానే అందులో క్యారెట్ తురుము వేసి కనీసం ఎనిమిది నుంచి పది నిమిషాల పాటు ఉడికించాలి.ఆ తర్వాత బ్లెండర్ తీసుకుని అందులో అరకప్పు అరటిపండు ముక్కలు, ఉడికించుకున్న క్యారెట్, రెండు టేబుల్ స్పూన్లు పెరుగు వేసుకుని మెత్తని పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి.

ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమంలో రెండు టేబుల్ స్పూన్లు ఆలివ్ ఆయిల్ వేసుకుని అన్నీ కలిసేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి.

Telugu Care, Care Tips, Fall, Pack, Long, Thick-Telugu Health Tips

ఇప్పుడు ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల‌ నుంచి చివర్ల వరకు అప్లై చేసుకుని షవర్ క్యాప్ ధరించాలి.గంటన్నర అనంతరం మైల్డ్ షాంపూ యూస్ చేసి గోరు వెచ్చని నీటితో శుభ్రంగా తలస్నానం చేయాలి.వారంలో ఒక్కసారి ఈ హెయిర్ ప్యాక్ ను వేసుకుంటే కనుక కుదుళ్ళు స్ట్రాంగ్ గా మారి జుట్టు రాలడం క్రమంగా తగ్గుముఖం పడుతుంది.

అదే సమయంలో జుట్టు ఒత్తుగా మరియు పొడుగ్గా సైతం పెరుగుతుంది.కాబట్టి హెయిర్ ఫాల్ తో సతమతం అయ్యేవారు తప్పకుండా ఈ ప్యాక్ ను ట్రై చేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube