Allu arjun pushpa re release kerala: ఇది కదా అక్కడ బన్నీ స్టామినా.. పుష్ప భారీ రీ రిలీజ్‌

అల్లు అర్జున్ హీరో గా సుకుమార్ దర్శకత్వం లో రూపొందిన పుష్ప సినిమా దాదాపుగా 400 కోట్ల రూపాయల కలెక్షన్స్ నమోదు చేసిన విషయం తెలిసిందే.మలయాళం లో పుష్ప భారీ కలెక్షన్స్ నమోదు చేసి స్థానిక హీరోల సినిమా లకు పోటీ అన్నట్లుగా నిలిచింది.

 Allu Arjun And Rashmika Mandanna Pushpa Movie Re Release In Kerala Details, Allu-TeluguStop.com

సుకుమార్ దర్శకత్వం లో గతం లో వచ్చిన సినిమాలన్నింటి లోకి ఈ సినిమా రికార్డు స్థాయి కలెక్షన్స్ ని నమోదు చేయడం జరిగింది.ఇక అల్లు అర్జున్ కెరీర్ లో కూడా ఇదే బిగ్గెస్ట్ మూవీ గా నిలిచింది.

అల్లు అర్జున్ కి సాధారణం గానే కేరళలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.అలాంటి అల్లు అర్జున్ తాజాగా మరో సారి తన స్టామినా ఏంటో నిరూపించుకున్నాడు.

పుష్ప సినిమా ను కేరళ లో వంద కు పైగా సెంటర్స్ లో రీ రిలీజ్ చేయడం తో మంచి స్పందన దక్కింది.కేవలం అల్లు అర్జున్ కి మాత్రమే ఇది సాధ్యం అంటూ ఆయన అభిమానులు మరియు ఇండస్ట్రీ వర్గాల వారు మాట్లాడుకుంటున్నారు.

ఒక సినిమా ఈ మధ్య కాలం లో రీ రిలీజ్‌ అవ్వడం అంటే మామూలు విషయం కాదు, అది కూడా ఒక డబ్బింగ్ సినిమా ను భారీ ఎత్తున సక్సెస్ చేయడం.భారీ గా వసూలు రావడం అనేది చాలా అరుదుగా జరుగుతుంది.

Telugu Allu Arjun, Kerala, Pushpa, Pushpa Rule, Sukumar-Movie

పుష్ప సినిమా రేంజ్‌ ఏంటి అనేది అల్లు అర్జున్ యొక్క స్థాయి ఏంటీ అనేది ఈ సినిమా యొక్క వసూల ను చూస్తుంటే అర్థమవుతుంది అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు మాట్లాడుకుంటున్నారు.అల్లు అర్జున్ యొక్క స్టామినా ఇది కదా అంటూ చాలా మంది చాలా రకాలుగా ఈ విషయమై సోషల్ మీడియా ద్వారా చర్చించుకోవడం వైరల్ అవుతుంది.మరో వైపు పుష్ప 2 సినిమా షూటింగ్ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి అంటూ ఇటీవల సుకుమార్ అధికారికంగా ప్రకటించింది.అల్లు అర్జున్ షూటింగ్ లో జాయిన్ అయ్యాడా లేదా అనేది తెలియాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube