బీట్ రూట్.( Beet root ) దీని గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు.బీట్ రూట్ తియ్యగా ఉంటుంది.అలాగే అనేక రకాల విటమిన్స్, మినరల్స్ ను కలిగి ఉంటుంది.వారానికి కనీసం రెండు సార్లు బీట్ రూట్ తీసుకుంటే రక్తహీనత పరార్ అవ్వడమే కాకుండా బోలెడు ఆరోగ్య లాభాలు పొందుతారు.అయితే ఆరోగ్యపరంగానే కాదు జుట్టు సంరక్షణకు కూడా బీట్ రూట్ ఉపయోగపడుతుందని మీకు తెలుసా.? అవును, మీరు విన్నది నిజమే.ముఖ్యంగా బీట్ రూట్ తో ఇప్పుడు చెప్పబోయే విధంగా హెయిర్ మాస్క్ వేసుకుంటే మీ జుట్టు డబుల్ అవ్వడం ఖాయం.
మరి ఇంకెందుకు ఆలస్యం బీట్ రూట్ తో హెయిర్ మాస్క్ ను ఎలా వేసుకోవాలో తెలుసుకుందాం పదండి.

ముందుగా ఒక బీట్ రూట్.( Beet root ) తీసుకుని పీల్ తొలగించి ముక్కలుగా కట్ చేసుకోవాలి.ఈ ముక్కలను మిక్సీ జార్ లో వేసి మెత్తగా గ్రైండ్ చేసి జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.
ఆ తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక కప్పు ఉడికించిన రైస్( Rice ) ను వేసుకోవాలి.నైట్ మిగిలిపోయిన రైస్ కూడా ఉపయోగించవచ్చు.

రైస్ తో పాటు అర కప్పు బీట్ రూట్ జ్యూస్</em వేసుకుని స్మూత్ పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి.ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమంలో ఒక ఎగ్ వైట్ తో పాటు రెండు టేబుల్ స్పూన్ల ఆముదం>( Castor Oil ) వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.గంట అనంతరం శుభ్రంగా తల స్నానం చేయాలి.వారానికి ఒక్కసారి బీట్ రూట్ తో ఈ హెయిర్ మాస్క్ వేసుకుంటే సరిపోతుంది.ఈ రెమెడీ జుట్టును ఒత్తుగా మార్చడానికి అద్భుతంగా సహాయపడుతుంది.
ఊడిన జుట్టు కూడా మళ్లీ వస్తుంది.కొద్ది రోజుల్లోనే మీ జుట్టు డబుల్ అవుతుంది.
అలాగే కురులు పొడుగ్గా సైతం పెరుగుతాయి.







