రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం రామన్నపేట గ్రామానికి చెందిన రమంచా సుధాకర్, అతని వర్గీయులు ఆనంతపల్లి గ్రామానికి చెందిన బూరుగు ప్రవీణ్, ఆరెపల్లి మధు, వారి వర్గీయులు బోయినిపల్లి మండల బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు కత్తెరపాక కొండయ్య, జడ్పీటీసీ కత్తెరపాక ఉమకొండయ్య ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు.ఈ సందర్భంగా కత్తెరపాక కొండయ్య మాట్లాడుతూ,
కేసీఆర్ సంక్షేమ పథకాలు, చేస్తున్న అభివృద్ధి చూసిన పార్టీలోకి రావడం నిజంగా శుభపరిణామం అని అన్నారు.
భవిష్యత్ లో మరిన్ని చెరికలు ఇలాగే కొనసాగుతాయి అని అన్నారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చిక్కాల సుధాకర్ రావు, బిఆర్ఎస్ నాయకులు పురుషోత్తంరెడ్డి, కవ్వంపల్లి రాములు, జంగిటి సంజీవ్, మంద వెంకటేష్, ఎర్ర అనిల్, నాయకులు పాల్గొన్నారు.







