Hair Care Tips :చ‌లికాలంలో జుట్టును హెల్తీ అండ్ షైనీగా ఉంచే ప‌వ‌ర్ ఫుల్ రెమెడీ మీకోసం!

చలికాలం స్టార్ట్ అయింది.ఈ సీజ‌న్ లో వివిధ రకాల అనారోగ్య సమస్యలు, చర్మ సమస్యలే కాదు జుట్టు సంబంధిత సమస్యలు సైతం తీవ్రంగా కలవర పెడుతుంటాయి.

 A Powerful Remedy To Keep Your Hair Healthy And Shiny In Winter Is For You , Pow-TeluguStop.com

ముఖ్యంగా తలలో తేమ తగ్గి పోయి జుట్టు పొడిబారడం, చుండ్రు, జుట్టు అధికంగా రాల‌డం తదితర సమస్యలు వేధిస్తూ ఉంటాయి.అయితే వీటన్నిటికీ చెక్ పెట్టి కురుల‌ను హెల్తీగా మరియు షైనీగా మెరిపించడానికి ఒక పవర్ ఫుల్ రెమెడీ ఉంది.

ఆ రెమెడీ ఏంటి.? అన్నది ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఇప్పుడు తెలుసుకుందాం.

ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో కప్పు బియ్యం వేసి గ్లాస్ వాటర్ పోసి నైట్ అంతా నానబెట్టుకోవాలి.మరుసటి రోజు నానబెట్టుకున్న బియ్యం నుంచి వాటర్ ను సపరేట్ చేసుకోవాలి.

ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో ఒకటిన్నర టేబుల్ స్పూన్ అలోవెరా జెల్ వేసుకోవాలి.అలాగే అందులో వన్ టేబుల్ స్పూన్ ఆపిల్ సైడర్ వెనిగర్ ను వేసి బాగా మిక్స్ చేయాలి.

Telugu Dandruff, Dry, Care, Care Tips, Fall, Healthy, Latest, Powerful Remedy-Te

చివరిగా సపరేట్ చేసి పెట్టుకున్న‌ రైస్ వాటర్ వేసి బాగా మిక్స్ చేసి స్ప్రే బాటిల్ లో నింపుకోవాలి.తలతో పాటు జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు ప్రిపేర్ చేసుకున్న వాటర్ ను స్ప్రే చేసుకోవాలి.‌ నైట్ నిద్రించే ముందు స్ప్రే చేసుకుని మరుసటి రోజు ఉదయాన్నే మైల్డ్ షాంపూ తో తలస్నానం చేయాలి.వారంలో ఒకటి లేదా రెండు సార్లు ఈ విధంగా చేస్తే చుండ్రు సమస్య పోతుంది.

హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది.పొడి జుట్టు నుంచి ఉపశమనం లభిస్తుంది.

మరియు కురులు హెల్తీ అండ్‌ షైనీగా మెరుస్తాయి.కాబట్టి ప్రస్తుత ఈ చలికాలంలో తప్పకుండా ఈ రెమెడీని ట్రై చేయండి.

మంచి ఫలితాలు మీ సొంతం అవుతాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube