సాధారణంగా ఏ ఇండస్ట్రీ అయినా సరే వారసత్వాన్ని పుణికిపుచ్చుకుంటారు.అందులో సినిమా ఇండస్ట్రీ అంటే మరీ ఎక్కువగా ఉంటుంది.
తమ తోబుట్టువులు హీరోయిన్స్ గా లేదా హీరోగా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన వారు చాలా మంది ఉన్నారు .ఇప్పటికే చాలామంది అక్కచెల్లెళ్లు అన్నదమ్ములు ఇండస్ట్రీలో ఉన్నప్పటికి ఇద్దరి కన్నా ఎక్కువ అంటే ఏకంగా ముగ్గురు నటిమణులు హీరోయిన్స్ గా ఇండస్ట్రీకి వచ్చి హిట్ అయిన దాఖలాలు చాలా తక్కువ ఉన్నాయి .అలా హీరోయిన్స్ గా ఎంట్రీ ఇచ్చి సక్సెస్ అయిన ముగ్గురు తోబుట్టువులు ఎంతమంది ఉన్నారో చూద్దాం.
ట్రావెన్ కోర్ సిస్టర్స్
ట్రావెన్ కోర్ సిస్టర్స్ గా పేరు దక్కించుకున్నారు కేరళకు చెందిన ఈ ముగ్గురు అక్క చెల్లెలు.
వారే లలిత, పద్మిని, రాగిణి.సినిమా ఇండస్ట్రీ తొలినాల్లలో అంటే దాదాపుగా 1960 దశకంలో ఈ ముగ్గురు అక్కచెల్లెళ్లు హీరోయిన్స్ గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు.
తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ పరిశ్రమలలో వారి హవా చాటారు.

ఊేర్వశి, కల్పన, కళారంజని
తమిళనాట ఈ ముగ్గురు అక్కచెల్లెళ్ల గురించి తెలియని వారు ఉండరు.ఇప్పటికి ఊర్వశి నటిగా అనేక సినిమాల్లో నటిస్తోంది.వీరు 80వ దశకంలో హీరోయిన్స్ గా ఎంట్రీ ఇచ్చి సక్సెస్ అయ్యారు.
ఇక కల్పన ఊపిరి సినిమా సమయంలో హైదరాబాద్ లోని ఒక హోటల్లో కన్నుమూయాగా కళారంజని, ఊర్వశి ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టులుగా కొనసాగుతున్నారు.

నగ్మా, జ్యోతిక, రోషిణి
నేటితరం హీరో సూర్య భార్య జ్యోతిక మనందరికీ బాగా తెలుసు.జ్యోతిక అక్క నగ్మా అలాగే చెల్లి రోషిణి కూడా సినిమాల్లో 90స్ లోనే ఎంట్రీ ఇచ్చి అదరగొట్టారు.ఇక నగ్మా హీరోయిన్ గా యావత్ సౌత్ ఇండియాలోనే కాదు బాలీవుడ్ లో సైతం అనేక సినిమాల్లో నటించింది జ్యోతిక, రోషిణి తెలుగు, తమిళ, కన్నడలో కూడా నటించి మెప్పించారు.
వనిత, ప్రీతి, శ్రీదేవి
అలనాటి స్టార్ హీరోయిన్ మంజుల అలాగే నటుడు విజయ్ కుమార్ ల కుమార్తెలు వనిత, ప్రీతి, శ్రీదేవి.ఈ ముగ్గురు కూడా హీరోయిన్స్ గా కొన్నేళ్లపాటు తమ హవాని చాటుకున్నారు.
వనిత దేవి సినిమాలో హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వగా, ప్రీతి రుక్మిణి కళ్యాణం సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగు పెట్టింది.ఇక ప్రభాస్ నటించిన ఈశ్వర్ సినిమాతో శ్రీదేవి తెలుగు సినిమా పరిశ్రమకు పరిచయమైంది ఈ ముగ్గురు అక్కచెల్లెళ్ళు తెలుగు తమిళ కన్నడ భాషల్లో ఎక్కువగా నటించారు.