పవన్ కల్యాణ్ చేసిన మూవీస్ తక్కువే అయినా.మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ పొందిన హీరో.
ఆయన ఓవరాల్ సినిమాలు 27 కాగా.అందులో సగం మాత్రమే హిట్లు.
కొన్నిసార్లు వరుస ఫ్లాఫులతో ఇబ్బంది పడ్డాడు.అలాంటి సమయంలో ఓ సినిమా తనకు మంచి బూస్ట్ ఇచ్చింది.
ఎన్నో రికార్డులు సృష్టించింది.ఇంతకీ ఆ సినిమా ఏంటి? ఆ రికార్డులు ఏంటి? ఇప్పుడు తెలుసుకుందాం! ఖుషీ సినిమా విజయం తర్వాత.పవన్ నటించిన వరుసగా ఐదు సినిమాలు అట్టర్ ఫ్లాప్ అయ్యాయి.ఆయనకు ఇక హిట్ రాదు అనే మాటలూ అప్పుడు వినపడ్డాయి.సరిగ్గా అదే సమయంలో వచ్చింది జల్సా.2008, ఏప్రిల్ 2వ ఈ మూవీ రిలీజ్ అయ్యింది.తొలి రోజు నుంచి మంచి టాక్ తెచ్చుకుంది.చివరకు హిట్ అయ్యింది.ఈ మూవీతో పవన్‌పై విమర్శలకు బ్రేక్ పడింది.వాస్తవానికి జల్సా పవన్ ఇమేజ్‌కు సరిపడిన మూవీ ఏమీ కాదు.
మాస్ ప్రేక్షకులను ఆకట్టుకునేదీ కాదు.సంజయ్ సాహు అనే యువకుడు తన జీవితంలో ఎదుర్కొన్న ఇబ్బందులను చూపించే నార్మల్ స్టోరీ.
గీతా ఆర్ట్స్ బ్యానర్ మీద.మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది.దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.అప్పట్లో ఈ సినిమా పాటలు అందరినీ ఆకట్టుకున్నాయి.అంతేకాదు.పవన్ కల్యాణ్ కెరీర్లోనే అత్యధిక వసూళ్లు చేపట్టిన సినిమా జల్సా నిలిచింది.
అంతేకాదు ఈ సినిమా పలు రికార్డులను సాధించింది.
* జల్సా సినిమా నుంచే ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల మొదలైంది.*ఆడియో రిలీజ్ కు ముందే ఈ సినిమాలోని 3 సినిమాలు లీక్ అయ్యాయి.అవి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.* కేవలం ఆడియో సిడిల ద్వారా కోటి రూపాయలు కలెక్ట్ చేసిన ఒకే ఒక చిత్రం జల్సా*నైజాం లో రూ.9.10 కోట్ల వసూళ్లు సాధించిన తొలి చిత్రంగా జల్సా నిలిచింది.* ఒక సినిమా ఆడియో రిలీజ్ ఫంక్షన్ కి పాసులు ఇచ్చి ఫ్యాన్స్ కు సీట్లు ఇవ్వడం ఈ సినిమా నుంచి షురూ అయ్యింది.* 12 ఏళ్ళ తరువాత బాలీవుడ్ స్టార్ ర్యాప్ సింగర్ బాబా సెహగల్ టాలీవుడ్లోకి అడుగు పెట్టాడు.అంతకుముందు మెగాస్టార్ చిరంజీవి నటించిన రిక్షావోడు సినిమా బాబా పాడారు.* ‘గాల్లో తేలినట్టుందే’ అనే ఒకే ఒక్క పాట కోసం కోటి రూపాయలతో సెట్ వేశారు.అప్పట్లో ఇదో రికార్డు.* వరల్డ్ వైడ్ గా 1000 స్క్రీన్లలో రిలీజ్ అయిన తొలి తెలుగు సినిమా జల్సా. * స్టార్ హీరో అయిన పవన్ కళ్యాణ్ సినిమాకి మరో స్టార్ హీరో మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఇవ్వడం జల్సాలోనే జరిగింది.* 282 కేంద్రాల్లో 50 రోజులు ఈ సినిమా ఆడటం పవన్ కెరీర్లో ఒక రికార్డు.* ప్రసాద్స్ లో రూ.85 లక్షలు కలెక్ట్ చేసిన మొట్టమొదటి చిత్రం కావడం విశేషం.* ఓవర్సీస్ లో రూ.4 కోట్ల పైగా గ్రాస్ ను కలెక్ట్ చేసిన చిత్రంగా జల్సా రికార్డు సృష్టించింది.