గుజరాత్‌లోని అహ్మదాబాద్( Ahmedabad ) నగరంలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది.షేలా ప్రాంతానికి చెందిన 16 ఏళ్ల బాలిక స్వయంగా తన ఇంట్లోనే దొంగతనానికి( Robbery ) పాల్పడింది.
బాయ్‌ఫ్రెండ్( Boyfriend ) మాటలు నమ్మి, ఏకంగా ఇంటిలో బీరువాలో దాచిన లాకర్‌నే( Locker ) ఎత్తుకెళ్లిపోయింది.ఈ దారుణమైన చోరీ సీసీటీవీ కెమెరాల్లో రికార్డు కావడంతో తండ్రి ఒక్కసారిగా షాక్ తిన్నాడు.
వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.పోలీసులు బాయ్‌ఫ్రెండ్ రితురాజ్ సింగ్ చావ్‌డాను అరెస్టు చేయగా, ప్రస్తుతం ఈ కేసు విచారణలో ఉంది.
2024, సెప్టెంబర్ 29న షేలాలోని ఓ అపార్ట్‌మెంట్‌లో ఈ ఘటన జరిగింది.బాలిక తండ్రి తన బీరువాలో ఓ లాకర్‌ను భద్రంగా దాచిపెట్టాడు.ఆ లాకర్‌లో 12 బోర్ గన్‌కు చెందిన 22 తూటాలు, ఆయుధ లైసెన్స్, పాస్‌పోర్ట్, బంగారు ఆభరణాలు ఇంకా రూ.1.56 లక్షల విలువైన ఇతర విలువైన వస్తువులు ఉన్నాయి.కొన్ని నెలల తర్వాత స్కూటర్ డాక్యుమెంట్స్ కోసం వెతుకుతుండగా తండ్రికి లాకర్ కనిపించలేదు.
ఇంటిలో ఎక్కడ వెతికినా ఆచూకీ లేకపోవడంతో అనుమానం వచ్చి అపార్ట్‌మెంట్ సీసీటీవీ ఫుటేజీని పరిశీలించాడు.
సీసీటీవీ ఫుటేజీ చూడగానే తండ్రికి దిమ్మతిరిగిపోయింది.
స్వంత కూతురే ఓ యువకుడితో కలిసి ఇంట్లో నుంచి ఓ పెట్టెను బయటకు మోసుకెళ్లడం చూసి షాక్ అయ్యాడు.ఆ పెట్టె మరేదో కాదు, బీరువాలో దాచిన లాకర్ అని గుర్తించాడు.
కళ్ల ముందే జరుగుతున్నది నమ్మలేక ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు.సొంత కూతురే ఇలాంటి పని చేస్తుందని కలలో కూడా ఊహించలేకపోయాడు.
వెంటనే కూతురిని నిలదీయగా మొదట ఆమె దొంగతనాన్ని ఖండించింది.ఆ తర్వాత సీసీటీవీ ఫుటేజీలో ఉన్న యువకుడు కంకారియా, అహ్మదాబాద్‌కు చెందిన రితురాజ్ సింగ్ చావ్‌డా అని గుర్తించాడు.అయితే బాలిక మాత్రం తాను లాకర్ కాదని, వేరే పెట్టె మాత్రమే తీసుకెళ్లానని బుకాయించింది.కానీ తండ్రి మాత్రం సీసీటీవీ ఫుటేజీలో స్పష్టంగా లాకర్ ఉండటాన్ని గుర్తించాడు.
లాకర్‌లో తూటాలు, ముఖ్యమైన పత్రాలు ఉండటంతో తండ్రి వెంటనే బోపాల్ పోలీస్ స్టేషన్‌లో( Bhopal Police Station ) ఫిర్యాదు చేశాడు.పోలీసులు కేసు నమోదు చేసుకుని రితురాజ్‌ను అదుపులోకి తీసుకుని విచారించడం మొదలుపెట్టారు.విచారణలో రితురాజ్ అసలు నిజం ఒప్పుకున్నాడు.బాలికను ప్రేరేపించి లాకర్ దొంగతనం చేయించినట్టు అంగీకరించాడు.రెండేళ్ల క్రితం నవరాత్రి ఉత్సవాల్లో వీరికి పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది.ఆర్థిక ఇబ్బందుల్లో ఉండటంతో రితురాజ్ తన ప్రియురాలిని ఇంటిలో దొంగతనం చేయమని పురిగొల్పాడు.
లాకర్ దొంగిలించిన తర్వాత అందులోని వస్తువులను వాసనా రివర్‌ఫ్రంట్ సమీపంలోని పొదల్లో పడేసినట్లు రితురాజ్ చెప్పాడు.పోలీసులు వాటి కోసం గాలిస్తున్నారు.ఈ కేసులో మందుగుండు సామగ్రి కూడా ఉండటంతో పోలీసులు అన్ని కోణాల్లోనూ విచారణ చేస్తున్నారు.బాలిక, రితురాజ్‌లపై ఎలాంటి చట్టపరమైన చర్యలు తీసుకోవాలో పోలీసులు నిర్ణయిస్తున్నారు.
ప్రస్తుతం దొంగిలించిన వస్తువుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.