ఆడవారిలో చాలా మందిని కలవరపెట్టే సమస్య ఫేషియల్ హెయిర్.( Facial Hair ) ముఖంపై అవాంఛిత రోమాలు కొందరికి కాస్త అధికంగా ఉంటాయి.
వీటి వల్ల స్కిన్ కలర్ లైట్ అవుతుంది.మరియు ఆకర్షణీయత కూడా తగ్గుతుంది.
ఈ క్రమంలోనే ఫేషియల్ హెయిర్ ను రిమూవ్ చేసుకునేందుకు వాక్సింగ్, థ్రెడింగ్ లేదా షేవింగ్ ను ఎంచుకుంటారు.అయితే తరచూ వాక్సింగ్, థ్రెడింగ్ చేయించుకోవడం వల్ల చర్మ ఆరోగ్యం అనేది పాడవుతుంది.
షేవింగ్ వల్ల హెయిర్ అనేది మళ్లీ వేగంగా గ్రోత్ అవుతుంది.

కానీ ఇప్పుడు చెప్పబోయే సింపుల్ హోమ్ రెమెడీని కనుక ప్రయత్నించారంటే వాక్సింగ్ తో( Vaxing ) పని లేకుండా ఇంట్లోనే సులభంగా ఫేషియల్ హెయిర్ తొలగించుకోవచ్చు.అందుకోసం ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్లు బియ్యం పిండి,( Rice Flour ) వన్ టీ స్పూన్ షుగర్( Sugar ) మరియు పావు కప్పు వేడి వేడి పాలు( Hot Milk ) పోసి బాగా మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఇందులో హాఫ్ టీ స్పూన్ లెమన్ జ్యూస్,( Lemon Juice ) హాఫ్ టీ స్పూన్ ఆలివ్ ఆయిల్ లేదా కోకోనట్ ఆయిల్ వేసి మరోసారి కలుపుకోవాలి.

ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకుని పదిహేను నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.ఆపై హెయిర్ కు ఆపోజిట్ డైరెక్షన్ లో చర్మాన్ని స్క్రబ్బింగ్ చేస్తూ వేసుకున్న ప్యాక్ ను తొలగించాలి.ఫైనల్ గా వాటర్ తో శుభ్రంగా ఫేస్ ను క్లీన్ చేసుకుని మాయిశ్చరైజర్ ను అప్లై చేసుకోవాలి.ఈ ప్రాసెస్ లో ఫేషియల్ హెయిర్ అనేది ఊడిపోతుంది.
వారానికి ఒకసారి ఈ హోమ్ రెమెడీని కనుక పాటిస్తే ముఖంపై ఉన్న అవాంఛిత రోమాలు తొలగిపోవడమే కాకుండా వాటి గ్రోత్ కూడా తగ్గుతుంది.అంతేకాకుండా ఈ రెమెడీ చర్మాన్ని వైట్ గా, బ్రైట్ గా మారుస్తుంది.
క్లీన్ అండ్ క్లియర్ స్కిన్ ను మీ సొంతం చేస్తుంది.