న్యాచురల్ స్టార్ నాని( Natural Star Nani ) నటించిన హిట్3 సినిమా( Hit 3 Movie ) నుంచి తాజాగా టీజర్ రిలీజ్ కాగా ఈ టీజర్ కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.అర్జున్ సర్కార్( Arjun Sarkar ) అనే పాత్రలో ఈ సినిమాలో నాని కనిపించనున్నారు.
టీజర్ లో యాక్షన్ సన్నివేశాలకు ప్రాధాన్యత ఇవ్వగా నాని గతంలో ఎప్పుడూ కనిపించని పాత్రలో ఈ సినిమాలో కనిపించనున్నారని సమాచారం అందుతోంది.నాని ఈ సినిమాతో ఇండస్ట్రీ హిట్ సాధించడం పక్కా అని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
టీజర్ లో నాని నోటి నుంచి బూతులు రావడం కూడా ఒకింత హాట్ టాపిక్ అవుతోంది.శేలేష్ కొలను( Sailesh Kolanu ) సైంధవ్ సినిమా విషయంలో చేసిన పొరపాట్లు ఈ సినిమా విషయంలో చేయలేదని టీజర్ చూస్తే అర్థమవుతోంది.
ఈ మధ్య కాలంలో వరుస విజయాలు సాధిస్తున్న నాని 2025 సంవత్సరానికి కూడా శుభారంభం ఇవ్వనున్నారని టీజర్( Hit 3 Teaser ) చూస్తే అర్థమవుతోంది.

రూత్ లెస్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నాని నటించాడు అనే కంటే జీవించాడని చెప్పవచ్చు.హీరో నాని పుట్టినరోజు( Nani Birthday ) సందర్భంగా ఈ టీజర్ విడుదలైంది.టీజర్ ను వయొలెంట్ గా ప్లాన్ చేసిన శేలేష్ కొలను ఈ సినిమాకు సెన్సార్ బోర్డ్ నుంచి ఎ సర్టిఫికెట్ వస్తుందని ఫిక్స్ అయినట్టేనని తెలుస్తోంది.
ఫ్యామిలీ ప్రేక్షకులను సైతం మెప్పించే విధంగా ఈ సినిమా ఉంటే బాగుండేదని చెప్పవచ్చు.

హిట్3 సినిమా కమర్షియల్ గా ఏ రేంజ్ లో ఉండబోతుందో చూడాల్సి ఉంది.నాని సొంత బ్యానర్ పై నాని సోదరి నిర్మాతగా ఈ సినిమా తెరకెక్కుతోంది.నాని రెమ్యునరేషన్ 30 కోట్ల రూపాయలకు అటూఇటుగా ఉందని సమాచారం అందుతోంది.
నాని కెరీర్ ప్లాన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయి.నాని త్వరలో దసరా2 సినిమాతో పాటు మరికొన్ని క్రేజీ ప్రాజెక్ట్ లలో నటించనున్నారు.







