హిందువులు గ్రాండ్ గా జరుపుకొనే పండుగలలో మహా శివరాత్రి ఒకటనే సంగతి తెలిసిందే.ఈ పండుగ అభిమానులకు ఎంతో ప్రత్యేకమైన పండుగ కాగా ఈ పండుగ రోజున హిందువులు ఉపవాసం ఉండటంతో పాటు జాగరణ కూడా చేస్తారు.
అయితే టాలీవుడ్, కోలీవుడ్, ఇతర సినీ హీరోలు తమ సినీ కెరీర్ లో శివుడి పాత్రలో నటించి మెప్పించిన సందర్భాలు ఎక్కువగానే ఉన్నాయనే సంగతి తెలిసిందే.
శ్రీ మంజునాథ సినిమాలో చిరంజీవి శివుని పాత్రలో నటించి తన నటనతో ఆకట్టుకున్నారు.
ఈ సినిమాలో చిరంజీవి అద్భుతమైన అభినయాన్ని కనబరిచారనే సంగతి తెలిసిందే.అయితే కమర్షియల్ గా ఈ సినిమా మత్రం ఆశించిన ఫలితాన్ని అందుకునే విషయంలో ఫెయిల్ అయిందని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అవసరం లేదు.
సీనియర్ ఎన్టీఆర్ దక్ష యజ్ఞం సినిమాతో పాటు ఉమా చండీ గౌరీ శంకరుల కథ సినిమాలో శివుని పాత్రలో నటించారు.

అక్కినేని నాగేశ్వరరావు మూగ మనసులు సినిమాలోని ఒక పాటలో శివుడి రోల్ లో యాక్ట్ చేశారు.బాలయ్య సైతం సీతారామ కళ్యాణం సినిమాలోని ఒక పాటలో శివుడి గెటప్ లో కనిపించారు.అక్షయ్ కుమార్ మంచు విష్ణు నటిస్తున్న కన్నప్ప సినిమాలో శివుని పాత్రలో కనిపించనున్నారు.
కమల్ హాసన్ బ్రహ్మచారి సినిమాలోని ఒక సీన్ లో శివుడి పాత్రలో కనిపించి ఆకట్టుకున్నారు.

రవితేజ చిరంజీవులు సినిమాలో ఒక సరదా సీన్ లో శివుని పాత్రలో కనిపించడం జరిగింది.జగపతిబాబు పెళ్లైన కొత్తలో సినిమాలో ఒక పాటలో శివుని రోల్ లో కనిపించారు.సుమన్ శ్రీ సత్యనారాయణస్వామి సినిమాలో శివుని పాత్రలో కనిపించారు.
కృష్ణంరాజు వినాయక విజయం సినిమాలో శోభన్ బాబు పరమానందయ్య శిష్యుల కథ సినిమాలో శివుని పాత్రల్లో కనిపించారు.