నిన్న ఛాంపియన్స్ ట్రోఫీలో( Champions Trophy ) పాకిస్థాన్( Pakistan ) మీద ఇండియా( India ) గెలవగానే దేశం మొత్తం సంబరాల్లో మునిగిపోయింది.క్రికెట్ ఫ్యాన్స్ సోషల్ మీడియాని టీమ్ ఇండియా పొగడ్తలతో నింపేశారు.
ముఖ్యంగా విరాట్ కోహ్లీని( Virat Kohli ) అయితే ఆకాశానికెత్తేశారు.అతను సెంచరీ కొట్టడంతో ఇండియా ఈజీగా గెలిచేసింది.
మ్యాచ్ స్టార్ హీరో అయిపోయాడు కోహ్లీ.
అయితే ఈ సంబరాల మధ్యలో అనుకోకుండా ఒక పేరు మాత్రం బాగా ట్రెండ్ అయిపోయింది.
ఆ పేరే అభయ్ సింగ్,( Abhay Singh ) అలియాస్ “ఐఐటీయన్ బాబా”.( IITian Baba ) ఈయనో పెద్ద శాస్త్రవేత్త అంట, ఏరోస్పేస్ ఇంజనీర్ అంట.కానీ ఇప్పుడు సన్యాసిగా మారిపోయాడు.ఈయనగారు ఇండియా ఓడిపోతుందని జోస్యం చెప్పాడు.
అంతే సోషల్ మీడియా జనాలు ఆడుకోవడం మొదలుపెట్టారు.
ఈ ఐఐటీయన్ బాబా ఎవరో కాదు.ముంబై ఐఐటీలో చదువుకున్నారట.మహాకుంభంలో బాగా ఫేమస్ అయ్యాడు.ఒక పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ ఇండియాకి పాకిస్థాన్ మీద గెలిచే ఛాన్సే లేదని గట్టిగా చెప్పాడు.“ఈసారి ఇండియా గెలవడం జరగదు.విరాట్ కోహ్లీ టీమ్ ఎంత ట్రై చేసినా వేస్ట్.నేను చెప్పానంటే అంతే, ఇండియా ఓడిపోతుంది” అని స్టేట్మెంట్ ఇచ్చాడు.
కానీ ఈయన చెప్పిన జోస్యం మొత్తం రివర్స్ కొట్టింది.ఇండియా దుమ్ము దులిపేసింది.అంతే నెటిజన్లు సోషల్ మీడియాని జోకులు, మీమ్స్‌తో నింపేశారు.“ఇంకా ఏమైనా జోస్యాలు ఉన్నాయా బాబా గారు?” అని సెటైర్లు వేస్తున్నారు.కొందరు అయితే ఇతడి అతి నమ్మకం ఎలా రివర్స్ అయిందో చూపిస్తూ కామెంట్లు పెడుతున్నారు.
ఇండియా గెలిచిన సంతోషంలో ఉంటే, ఐఐటీయన్ బాబా మాత్రం సోషల్ మీడియాలో ఫుల్ కామెడీ పీస్ అయిపోయాడు.
ఆయన జోస్యం బెడిసి కొట్టడంతో క్రికెట్‌లో అన్నీ ఊహించలేమని, ఎవ్వరూ గెలుపోటముల్ని కరెక్ట్‌గా చెప్పలేరని మరోసారి అందరికీ అర్థమైంది.