కెనడా నేషనల్ మ్యూజియం బాధ్యతలు మళ్లీ భారత సంతతి మహిళకే..!

భారత సంతతికి చెందిన మన్‌దీప్ రోషి చద్దాను( Mandeep Roshi Chadha ) నేషనల్ గ్యాలరీ ఆఫ్ కెనడా( National Gallery of Canada ) ట్రస్టీల బోర్డు వైస్ ఛైర్‌పర్సన్‌గా కెనడా ప్రభుత్వం తిరిగి నియమించింది.మాంట్రియల్‌లో స్థిరపడిన చద్దా గొప్ప మానవతావాదిగా, దాతగా గుర్తింపు తెచ్చుకున్నారు.

 Canada Reappoints Sikh Philanthropist Mandeep Roshi Chadha To Key Role In Nation-TeluguStop.com

మాంట్రియల్‌లోని అతిపెద్దదైన మ్యూజియం ఆఫ్ కెనడాలో సిక్కు గ్యాలరీని స్థాపించారు.

కెనడా హెరిటేజ్ మంత్రి సిఫారసు మేరకు మ్యూజియంల చట్టంలోని సెక్షన్ 18, 19 కింద క్యూబెక్‌లోని వెస్ట్‌మౌంట్‌కు చెందిన మన్‌దీప్ రోషి చద్దాను నేషనల్ గ్యాలరీ ఆఫ్ కెనడా ట్రస్టీల బోర్డు వైస్ ఛైర్‌పర్సన్‌గా నియమించడాన్ని గవర్నర్ జనరల్ ఇన్ కౌన్సిల్( Governor General in Council ) ఆమోదించారు.

మార్చి 26 నుంచి ఆమె నియామకం అమల్లోకి వస్తుందని.నాలుగేళ్ల పదవీ కాలానికి గాను మన్‌దీప్ ఈ పదవిలో ఉంటారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Telugu Canada, Governorgeneral, Mandeeproshi, Montreal, Nationalart, Nationalgal

కాగా.మాంట్రియల్ మ్యూజియం ఆఫ్ ఫైన్ ఆర్ట్స్‌లోని ఆర్ట్స్ ఆఫ్ వన్ వరల్డ్ వింగ్‌లో సిక్కు కళలు , కళాఖండాలు కొలువుదీరడానికి మన్‌దీప్ ఎంతో కృషి చేశారు.ఫైబర్ ఆప్టిక్స్ పితామహుడిగా పిలువబడే నరీందర్ సింగ్ కపానీ తాను సేకరించిన ఎన్నో విలువైన వస్తువులను మన్‌దీప్ సాయంతో ఈ మ్యూజియానికి విరాళంగా ఇచ్చారు.అలాగే కెనడియన్ కళలను భారతదేశంతోనూ చద్దా పంచుకుంటున్నారు.

న్యూఢిల్లీలోని కెనడా హైకమీషన్ ముందు ఉంచడానికి 9 అడుగుల పొడవైన ఇనుక్షుక్‌ను అందజేశారు.వాంకోవర్, టొరంటోలలో సిక్కు సంతతి ప్రజల ప్రాబల్యం ఎక్కువ.

అయినప్పటికీ మాంట్రియల్‌లోని మ్యూజియానికి ఈ స్థాయిలో కళాఖండాలు రావడానికి కారణం రోషి చద్దా దంపతులేనని స్థానికులు చెబుతుంటారు.

Telugu Canada, Governorgeneral, Mandeeproshi, Montreal, Nationalart, Nationalgal

కెనడా రాజధాని ఒట్టావాలో( Ottawa ) నేషనల్ గ్యాలరీ ఆఫ్ కెనడా ఉంది.ఇది కెనడాకి నేషనల్ ఆర్ట్ మ్యూజియం.దాదాపు 46,621 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఈ మ్యూజియం భవనాలు ఉండగా.

ఇందులో 12,400 చదరపు మీటర్ల స్థలాన్ని కళాఖండాలు ప్రదర్శించడానికి ఉపయోగిస్తారు.ఉత్తర అమెరికాలోని అతిపెద్ద ఆర్ట్ మ్యూజియంలలో ఇది కూడా ఒకటి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube