వైరల్ వీడియో: చూస్తుండగానే కుప్పకూలిన వంతెన

వంతెన కూలిపోతుండగా, కింద రహదారిపై వెళ్తున్న వాహనదారులు ఆ భయానక దృశ్యాన్ని తమ మొబైల్‌ ఫోన్‌లలో రికార్డ్ చేశారు.ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.వీడియోలో కనిపించిన దృశ్యాలు వింతగా, భయంకరంగా ఉన్నాయి.వంతెన పిల్లర్లు స్థిరంగా ఉండగా, మధ్య భాగం అకస్మాత్తుగా కూలిపోవడం స్పష్టంగా కనిపిస్తోంది.కూలిన వెంటనే పెద్ద ఎత్తున దుమ్ము లేచి ఆ ప్రాంతాన్ని కప్పేసింది.

 A Bridge Collapsed While Watching A Viral Video, South Korea, Bridge Collapse, C-TeluguStop.com

ఈ ఘటనపై దక్షిణ కొరియా నేషనల్ ఫైర్ ఏజెన్సీ ( South Korea National Fire Agency )అధికారిక ప్రకటన విడుదల చేసింది.బ్రిడ్జి కూలిన ఘటనలో ఇద్దరు మృతి చెందారని, నలుగురు తీవ్రంగా గాయపడ్డారని, మరొకరికి స్వల్ప గాయాలు అయ్యాయని తెలిపింది.క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు అధికారులు.

కూలిన శిథిలాల కింద ముగ్గురు చిక్కుకుపోయారని, వారిని రక్షించేందుకు సహాయ కార్యక్రమాలు కొనసాగుతున్నట్లు వెల్లడించారు.

దక్షిణ కొరియాలో కార్మిక ప్రమాదాలు తరచూ సంభవిస్తున్నాయి.ఆ దేశ కార్మిక శాఖ( Department of Labor ) లెక్కల ప్రకారం గత మూడేళ్ళలో దాదాపు 8,000 మంది కార్మికులు నిర్మాణ పనులు, ఇతర పారిశ్రామిక ప్రమాదాలలో ప్రాణాలు కోల్పోయారని తేలింది.ఇది పరిశ్రమలో భద్రతా ప్రమాణాలు మరింత పటిష్టంగా ఉండాల్సిన అవసరాన్ని తెలియజేస్తోంది.

ప్రస్తుతం ఈ బ్రిడ్జి కూలిపోవడానికి ( bridge to collapse )గల కారణాలపై అధికారులు విచారణ ప్రారంభించారు.నిర్మాణంలో లోపాలా? లేక భద్రతా చర్యలలో నిర్లక్ష్యమా? అన్నదానిపై పరిశీలిస్తున్నారు.ఈ ఘటన భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు తలెత్తకుండా మరింత కఠినమైన భద్రతా నియమాలను అమలు చేయాల్సిన అవసరాన్ని గుర్తుకు తెచ్చింది.ఇనేందుకు ఆలశ్యం.

మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి!

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube