ఛాంపియన్స్ ట్రోఫీలో దాయాది పాకిస్థాన్‌పై టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ( Virat Kohli ) అద్భుత శతకం బాది తన ఫామ్‌లోకి వచ్చిన సంగతి తెలిసిందే.గత కొన్ని రోజులుగా ఫామ్ లేకపోవడంతో విమర్శలు ఎదుర్కొన్న కోహ్లీ, ఈ మ్యాచ్‌లో దుమ్మురేపి తన ఆటతో మరోసారి నిరూపించుకున్నాడు.111 బంతుల్లో 7 బౌండరీలతో 100 పరుగులు చేసిన అతడు, టీమిండియా అభిమానుల హృదయాలను గెలుచుకున్నాడు.ఈ ఇన్నింగ్స్‌తో కోహ్లీపై నెటిజన్లు, మాజీ క్రికెటర్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
ఇక చివరగా కోహ్లీ సెంచరీ సాధించగానే అభిమానులు సోషల్ మీడియాలో హంగామా చేసారు.
అయితే, ఓ అభిమాని ఇచ్చిన రియాక్షన్ మాత్రం అందరి దృష్టిని ఆకర్షించింది.విరాట్ శతకం సాధించిన వెంటనే ఓ కుర్రవాడు అదంతా ఉత్సాహంతో ఇంటి మొత్తం పరిగెత్తుతూ, “ఐ లవ్ యూ కోహ్లీ”( I Love You Kohli ) అంటూ గట్టిగా అరవడం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.అతడు ఆనందంతో పూనకం వచ్చినట్టుగా ఊగిపోయి, చొక్కా విప్పి అరుస్తూ రచ్చ చేశాడు.
టీవీ ముందు పడుకుని విరాట్‌కు సాష్టాంగ నమస్కారం పెట్టడం అందరినీ నవ్విస్తోంది.
ఛాంపియన్స్ ట్రోఫీలో ఫెవరెట్‌గా బరిలోకి దిగిన టీమిండియాలో విరాట్ కోహ్లీపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.అయితే, న్యూజిలాండ్‌పై జరిగిన తొలి మ్యాచ్‌లో 38 బంతుల్లో కేవలం 22 పరుగులే చేయగలిగాడు.కానీ, పాకిస్థాన్‌తో(Pakistan) జరిగిన హై వోల్టేజ్ మ్యాచ్‌లో అద్భుత సెంచరీ సాధించి, అభిమానులకు మధురానుభూతిని అందించాడు.
విరాట్ కోహ్లీ ఫామ్‌లోకి రావడంతో టీమిండియా అభిమానుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది.ఈ టోర్నమెంట్‌లో కోహ్లీ మరిన్ని అద్భుత ఇన్నింగ్స్ ఆడతాడని ఆశిస్తున్న క్రికెట్ ప్రేమికులు సోషల్ మీడియాలో తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ఇక ఇలాంటి ఫ్యాన్స్ ఎక్కడా కనిపించరు.మీరు కూడా ఆ వీడియో చూసి.మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.