మెంతులను ఇలా తీసుకుంటే వెయిట్ లాస్ నుంచి షుగర్ కంట్రోల్ వరకు ఎన్నో బెనిఫిట్స్!

దాదాపు అందరి వంటింటి పోపుల పెట్టె లో ఉండే దినుసుల్లో మెంతులు ఒకటి.ఇవి రుచికి చేదుగా ఉన్న బోలెడన్ని పోషక విలువలను కలిగి ఉంటాయి.

 If You Take Fenugreek Like This, There Are Many Benefits From Weight Loss To Sug-TeluguStop.com

అందుకే మెంతులు ఆరోగ్యపరంగా అనేక ప్రయోజనాలను చేకూరుస్తాయి.ముఖ్యంగా ఇప్పుడు చెప్పబోయే విధంగా మెంతులను తీసుకుంటే వెయిట్ లాస్ నుంచి షుగర్ కంట్రోల్ వరకు ఎన్నో అద్భుతమైన బెనిఫిట్స్ ను మీ సొంతం చేసుకోవచ్చు.

మరి ఇంకెందుకు ఆలస్యం మెంతులను ఎలా తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదో తెలుసుకుందాం పదండి.

ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని అందులో ఒకటిన్నర కప్పు మెంతులను వేసి రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి.

ఇలా వేయించుకున్న మెంతులు పూర్తిగా చల్లారిన తర్వాత వాటిని మిక్సీ జార్ లో వేసి మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకోవాలి.ఈ మెంతుల పొడిని ఒక డబ్బాలో నింపుకుని స్టోర్ చేసుకోవాలి.

భోజనం చేసేటప్పుడు మొదటి రెండు ముద్దల్లో వన్ టేబుల్ స్పూన్ మెంతుల పొడి, వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని కలిపి తినాలి.

ఈ విధంగా మెంతులను ప్రతి రోజూ కనుక తీసుకుంటే మెటబాలిజం రేటు పెరుగుతుంది.దీంతో క్యాలరీలు కరిగే వేగం పెరిగి సూపర్ ఫాస్ట్ గా వెయిట్ లాస్ అవుతారు.అంతేకాదు మెంతులను పైన చెప్పిన విధంగా తీసుకుంటే మ‌ధుమేహం వ్యాధి గ్ర‌స్తుల్లో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి.

రక్తపోటు కంట్రోల్ తప్పకుండా ఉంటుంది.కంటి చూపు మెరుగు పడుతుంది.

చెడు కొలెస్ట్రాల్ క‌రిగి గుండె ఆరోగ్యంగా మారుతుంది.పలు రకాల క్యాన్సర్లు వచ్చే రిస్క్ తగ్గుతుంది.

హెయిర్ ఫాల్ సమస్య నుంచి బయటపడతారు.మెదడు మనుప‌టి కంటే చురుగ్గా వేగంగా పని చేస్తుంది.

మరియు ప్ర‌స‌వం అనంతరం మెంతుల‌ను పైన చెప్పిన విధంగా తీసుకుంటే తల్లుల్లో పాల ఉత్పత్తి సైతం పెరుగుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube