సినిమాల్లో నవ్వుతూ తెరపై కనిపిస్తే వారి నిజమైన జీవితాలు కూడా అంతే అందంగా ఉంటాయా అంటే ఖచ్చితంగా ఉండవు.అందుకు ఉదాహరణ జూనియర్ ఎన్టీఆర్ జీవితం.
మనందరికీ తెలిసిన విషయమే జూనియర్ ఎన్టీఆర్ తల్లి విషయంలో నందమూరి కుటుంబం ఎంతలా వ్యతిరేకించిందో అతని తల్లిని ఇంట్లోకి రానివ్వకుండా తొలినాళ్లలో ఎన్ని ఇబ్బందులకు గురి చేసిందో చూసాం.హరికృష్ణకు రెండవ భార్యగా రావడం వల్లే ఆమెకు ఆ కుటుంబంలో సరైన గౌరవ మర్యాదలు దక్కలేదు.
ఇప్పుడు తారక్ ఒక స్టార్ హీరో కాబట్టి నందమూరి కుటుంబం నుంచి ఈ తరంలో అలాంటి ఒక స్టార్ హీరో లేడు కాబట్టి అందరూ అతని వారసుడిగా ఒప్పుకున్నారు.కానీ తారక్ గుండెల్లో తన చిన్నతనం తాలూకు జ్ఞాపకాలు, గాయాలు అలాగే ఉన్నాయి.
తన తల్లిని, తనను దూరం పెట్టిన వారందరూ ఈ రోజు అక్కున చేసుకుంటున్నారు.నందమూరి కుటుంబంలో ఏ ఫంక్షన్ జరిగినా, పార్టీ జరిగిన అతడి తల్లి శాలిని ని, తారక్ ఎంతగానో అవమానించేవారు.తాను ఏ మర్యాద కోరుకుంటున్నాడో ఆ మర్యాద నేడు దక్కిన కూడా చిన్నతనంలో మాత్రం అవన్నీ తారకి చేదు అనుభవాలు అని చెప్పాలి.తన కుటుంబం చేసిన పనులను ఎప్పటికీ తారక్ కి బయటకు చెప్పడు.
అలాగే తను పడిన వేదనను కూడా చెప్పుకోవడానికి మీడియా ముందు ఇష్టపడడు.ఎందుకంటే అది తన కుటుంబం గా తను ఉండాలనుకుంటున్నాడు కాబట్టి.
నందమూరి వంశానికి వారసుడిగా ఉంటేనే తనకు ఒక కుటుంబం ఉన్నట్టుగా ఉంటుంది కాబట్టి తప్పక ఒప్పుకుంటున్నాడు.హరికృష్ణ భార్యగా తన తల్లికి దక్కాల్సిన గౌరవాన్ని దక్కించాలంటే ఆ కుటుంబంతోనే సయోధ్యగా ఉండాలి, ఆ కుటుంబంలోనే మెదలాలి.టిడిపి పార్టీ వల్ల నాడు చంద్రబాబు నాయుడు లక్ష్మీపార్వతిని ఎంతగానో అసహ్యించుకున్నాడు.ఆ విధంగానే గతంలో శాలిని ని కూడా పార్టీ మరియు కుటుంబం అసహ్యించుకుంది.కానీ తారక్ స్టార్ హీరో అయ్యాడు కాబట్టి పిల్లనిచ్చి మరియు పెళ్లి చేసి తారక్ ని తన వ్యక్తిగా చూపించుకునే ప్రయత్నం చేశాడు బాబు.ఇలా నాడు పనికిరాని తారక్ నేడు వారి కుటుంబానికి చాల దగ్గర వాడు అయ్యాడు.