త‌మ‌ల‌పాకు, వాము క‌లిపి ఇలా తీసుకుంటే మ‌స్తు హెల్త్ బెనిఫిట్స్‌!

త‌మ‌ల‌పాకు, వాము.ఈ రెండూ విడి విడిగా ఎన్నో పోష‌క విలువ‌ల‌ను క‌లిగి ఉంటాయి.అందుకే ఆరోగ్య ప‌రంగా ఇవి అనేక ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తాయి.అయితే వాము, త‌మ‌ల‌పాకుల‌ను విడి విడిగానే కాకుండా క‌లిపి కూడా తీసుకోవ‌చ్చు.వీటిని క‌లిపి ఇప్పుడు చెప్ప‌బోయే విధంగా తీసుకుంటే మ‌స్తు హెల్త్ బెనిఫిట్స్ ను త‌మ సొంతం చేసుకోవ‌చ్చు.మ‌రి ఇంకెందుకు ఆల‌స్యం అస‌లు మ్యాట‌ర్‌లోకి వెళ్లిపోదాం ప‌దండీ.

 Amazing Benefits Of Betel Leaves With Ajwain Seeds! Betel Leaves With Ajwain See-TeluguStop.com

ముందుగా ఫ్రెష్‌గా ఉన్న త‌మ‌ల‌మాకు తీసుకుని నీటితో శుభ్ర ప‌రుచుకోవాలి.ఇప్పుడు త‌మ‌ల‌ పాకులో పావు స్పూన్ వాము వేసి చుట్టుకోవాలి.

ఆ త‌ర్వాత దీనిని నోట్లో వేసుకుని బాగా న‌మిలి మింగేయాలి.ఈ విధంగా రోజుకు ఒక సారి చేస్తే అదిరిపోయే ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు ల‌భిస్తాయి.

ముఖ్యంగా బ‌ల‌హీన‌మైన జీర్ణ వ్య‌వ‌స్థ బ‌లంగా, చురుగ్గా మారుతుంది.దాంతో గ్యాస్‌, ఎసిడిటీ, మ‌ల‌బ‌ద్ధ‌కం, క‌డుపు ఉబ్బ‌రం వంటి జీర్ణ సంబంధిత స‌మ‌స్య‌లు దారి దాపుల్లోకి రాకుండా ఉంటాయి.

దగ్గు, జలుబు వంటి స‌మ‌స్య‌ల‌తో బాధ ప‌డే వారు రోజూ త‌మ‌ల‌పాకు, వాము క‌లిపి పైన చెప్పిన విధంగా తీసుకోవాలి.త‌ద్వారా రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ బ‌లోపేతం అయ్యి జ‌లుబు, ద‌గ్గు మ‌రియు ఇత‌ర సీజ‌న‌ల్ వ్యాధులు త‌గ్గుతాయి.అలాగే త‌మ‌ల‌పాకు, వాము క‌లిపి తీసుకుంటే డిప్రెష‌న్, త‌ల నొప్పి, అధిక ఒత్తిడి వంటి స‌మ‌స్య‌ల నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది.మ‌న‌సు, మెద‌డు ప్ర‌శాంతంగా మార‌తాయి.

అంతే కాదు, నోటి దుర్వాస‌న స‌మ‌స్య‌తో ఇబ్బంది ప‌డే వారు రోజూ త‌మ‌ల‌పాకుకు వామును కూడా చేర్చి బాగా న‌మిలి తినాలి.ఇలా చేస్తే నోటిలో పేరుకు పోయిన బ్యాక్టీరియా నాశ‌న‌మై బ్యాడ్ స్మెల్ రావ‌డం త‌గ్గు ముఖం ప‌డుతుంది.

ఇక వాము, త‌మ‌ల‌పాకు క‌లిపి తీసుకోవ‌డం వ‌ల్ల‌ దంతాలు, చిగుళ్లు సైతం బ‌ల‌ప‌డ‌తాయి.

Amazing Benefits Of Betel Leaves With Ajwain Seeds! Betel Leaves With Ajwain Seeds, Betel Leaves, Ajwain Seeds, Latest News, Health, Health Tips, Good Health - Telugu Ajwain Seeds, Betel, Tips, Latest

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube