ప్రస్తుత కాలంలో డయాబెటిస్ పేరు తెలియని వారు ఎవరూ ఉండరు.ప్రతి కుటుంబంలో ఎవరో ఒకరు ఈ డయాబెటిస్ బారిన పడుతున్నారు.
ఇందుకు గల కారణం మారుతున్న ఆహారపు అలవాట్లు కాగా, మరికొందరిలో జన్యుపరమైన కారణాల వల్ల డయాబెటిస్ తో బాధపడుతున్నారు.ఈ వ్యాధితో బాధ పడేవారు వారి ఆహార విషయంలో ఎంతో జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది.
ఎటువంటి ఆహార పదార్థాలు తినాలన్న కాస్త ఆలోచించి తినాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.అయితే డయాబెటిస్ తో బాధపడేవారు రవ్వతో చేసిన ఆహారాన్ని తీసుకోవచ్చా? తీసుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇక్కడ తెలుసుకుందాం…
మన ఇళ్లలో రవ్వతో ఎన్నో వెరైటీస్ చేసుకొని తింటుంటారు.ఇడ్లీ, దోస, రవ్వ ఊతప్పం ఇలా మొదలైన రకాలను చేసుకొని తింటారు.మధుమేహంతో బాధపడేవారు రవ్వతో చేసిన ఆహార పదార్థాలను తినడం ద్వారా రక్తంలోని చక్కెర స్థాయిలు నిలకడగా ఉంటాయని నిపుణులు సూచిస్తున్నారు.
రవ్వలో పిండి పదార్థాలు, కార్బోహైడ్రేట్లు తక్కువ పరిమాణంలో ఉండడం వల్ల డయాబెటిస్ తో బాధపడేవారు రవ్వతో చేసిన టిఫిన్ తినడానికి ఆలోచించాల్సిన పనిలేదు.
రవ్వ తో వివిధ రకాలైన రవ్వ దోశ, ఇడ్లీ, ఊతప్పం వంటి అల్పాహారాన్ని నిస్సంకోచంగా తీసుకోవచ్చు.వీటికి మరింత రుచి రావడానికి తాజా కూరగాయలతో కలిపి తీసుకుంటే మన శరీరానికి కావలసిన పోషకాలు అందుతాయి.డయాబెటిస్తో బాధపడేవారు వీలైనంత వరకు చక్కెర తో తయారు చేసిన పదార్థాలకు దూరంగా ఉండటం మంచిది.
వీలైనంత వరకు తాజా పండ్లు, కూరగాయలను అధికంగా తీసుకోవాలి.అన్నం తక్కువ పరిమాణంలో తీసుకుని, కూరలు అధికంగా తీసుకోవాలి.
రెగ్యులర్ గా డాక్టర్ల పర్యవేక్షణలో రక్తంలోని చక్కెర స్థాయిలను గమనించుకుంటూ ఉండాలి.క్రమం తప్పకుండా ప్రతిరోజు ఒక గంట పాటు వ్యాయామం చేయడం వల్ల డయాబెటిస్ ను అదుపులో ఉంచుకోవచ్చని డాక్టర్లు సూచిస్తున్నారు.