టాలీవుడ్ యంగ్ హీరో అఖిల్ అక్కినేని( Akhil Akkineni ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.అక్కినేని వారసుడిగా సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన అఖిల్ నటించిన తక్కువ సినిమాలే అయినప్పటికీ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.
సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నప్పటికీ ఆశించిన స్థాయిలో మాత్రం గుర్తింపు దక్కడం లేదు.ఇకపోతే అఖిల్ చివరగా ఏజెంట్ మూవీతో( Agent Movie ) ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.
భారీ అంచనాల నడుమ పాన్ ఇండియా లెవెల్ లో విడుదల అయిన ఈ సినిమా ఊహించని విధంగా డిజాస్టర్ గా నిలిచింది.ఈ సినిమాతో అఖిల్ కెరియర్ మారుతుందని అందరూ అనుకున్నారు.

కానీ ఈ సినిమా అటు అఖిల్ అంచనాలను ఇటు అభిమానుల అంచనాలను అందుకోలేకపోయింది.ఆ సంగతి పక్కన పెడితే అఖిల్ గత ఏడాది జైనబ్( Zainab ) అనే అమ్మాయితో ఎంగేజ్మెంట్ వేడుక జరుపుకున్న విషయం తెలిసిందే.ముందుగా ఎలాంటి హెచ్చరికలు లేకుండా ఊహించని విధంగా ఎంగేజ్మెంట్ వేడుక జరుపుకొని షాక్ ఇచ్చాడు అఖిల్.ఇక ఎంగేజ్మెంట్ వేడుక తర్వాత అఖిల్ ఎప్పుడెప్పుడు పెళ్లి పీటలు ఎక్కుతాడా అని అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.
మొదట్లో మార్చి 24న అఖిల్ అక్కినేని పెళ్లి( Akhil Akkineni Marriage ) అంటూ వార్తలు జోరుగా వినిపించాయి.కానీ ఈ వార్తలపై అక్కినేని ఫ్యామిలీ అసలు స్పందించలేదు.

అఖిల్ పెళ్లి అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరగడమే కానీ అక్కినేని ఫ్యామిలిలో ఎలాంటి చప్పుడు కనిపించడం లేదు.గత ఏడాది నవంబర్ లో అఖిల్ ఎంగేజ్మెంట్ జైనబ్ తో జరిగినపుడు అఖిల్ పెళ్లి మార్చ్ లో ఉంటుంది అనే టాక్ నడిచింది.నాగ చైతన్య పెళ్లి తర్వాత వెంటనే అఖిల్ పెళ్లి చెయ్యకుండా నాగ్ కాస్త గ్యాప్ తీసుకుంటున్నారు అన్నారు.మార్చి 24 అంటే నేడే అఖిల్ పెళ్లి జరగాల్సి ఉంది.
అంటే అది సోషల్ మీడియా టాక్ ప్రకారమైతే.అక్కినేని ఫ్యామిలీ నుంచి అఖిల్ పెళ్లి విషయమై ఎలాంటి వార్తా లేదు.
అసలు పెళ్లి పనులు మొదలయ్యాయా అనే చప్పుడు కనిపించడం లేదు.నాగార్జున చిన్న కొడుకు పెళ్లి ఖచ్చితంగా అంగరంగ వైభవముగా చేస్తారు ఇది పక్కా అని చెప్పాలి.
అది హైదరాబాద్ లోనా లేదంటే జైనబ్ కోసం దుబాయ్ లో చేస్తారా అనేది తెలియాల్సి ఉంది.అసలు అఖిల్ పెళ్లి ఎప్పుడు, ఏ తేదిన చెయ్యబోతున్నారు? దానికి ఎంతమంది హాజరవుతారు.నాగ్ అఖిల్ వివాహాన్ని ఎలా, ఎక్కడ చెయ్యబోతున్నారు ఇలాంటి ఎన్నో ప్రశ్నలు ప్రస్తుతం వినిపిస్తున్నాయి.కానీ అక్కినేని ఫ్యామిలీ మాత్రం అఖిల్ పెళ్లి విషయం గురించి ఇలాంటి అప్డేట్ ఇవ్వడం లేదు.